వైద్య పరిభాషలో... రష్మికకి ఏమైంది?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు గాయం అయిందనే విషయం తెల్సిందే. షూటింగ్ సమయంలో రష్మికకి గాయం అయిందనే వార్తలు వస్తున్నాయి.
By: Ramesh Palla | 1 Aug 2026 12:49 PM ISTస్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు గాయం అయిందనే విషయం తెల్సిందే. షూటింగ్ సమయంలో రష్మికకి గాయం అయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి హెల్త్ అప్‌డేట్‌ను ఇవ్వలేదు. ప్రస్తుతం రష్మిక గాయం నుంచి కోలుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో, ఫ్యామిలీ మెంబర్స్ ఆధ్వర్యంలో రష్మికకి చికిత్స జరుగుతుంది. ఇంతకు రష్మికకు ఏం జరిగింది, అసలు ఆమె ఆసుపత్రిలో పడటానికి కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆమె అభిమానులు తెగ వెతికేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక హిప్ ఏరియాలోని టెండన్ డిటాచ్‌మెంట్ వల్ల తీవ్రమైన నొప్పిని అనుభవిస్తుందని, అంతే కాకుండా ఆమె తన కాలును కదపలేక పోతుందనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. దాంతో టెండన్ డిటాచ్‌మెంట్ అంటే ఏంటా అని అంతా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.
రష్మికకి షూటింగ్‌లో ప్రమాదం...
మన శరీరంలో ఎముక తో కండరాన్ని గట్టిగా పట్టి ఉంచే పీచు వంటి ఒక పదార్థంను టెండన్ అంటారు. ఆ టెండన్ ద్వారా ఎముకలు, కండరాల మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది. బరువు ఎత్తాలన్నా, కండరాలు కదలాలి అన్నా, అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కచ్చితంగా టెండన్ హెల్ప్ అవసరం అవుతుంది. అలాంటి టెండన్ రష్మిక షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో అధిక ఒత్తిడి కారణంగా డిటాచ్‌మెంట్ అయిందని వైద్యులు చెబుతున్నారు. టెండన్ డిటాచ్‌మెంట్ అంటే.. టెండాన్లు చాలా బలంగా కండరాలు, ఎముకలు పట్టి ఉంటాయి. కానీ అధిక ఒత్తిడి లేదా మరేదైన కారణం వల్ల ఎముక నుంచి టెండన్ పూర్తిగా ఉడి పోవడంను వైద్య పరిభాషలో టెండన్ డిటాచ్‌మెంట్ అంటారు. ఎముక నుంచి టెండన్ విడిపోయిన సమయంలో ఎముకకి సంబంధించిన చిన్న ముక్క సైతం విరగడంను అవల్షన్ టియర్ అంటారు. టెండన్‌తో పాటు ఎముక సైతం చిన్న ఫ్రాక్చర్ కావడం వల్ల ఊడి పోయిందని వైద్యులు చెబుతున్నారు.
రష్మిక మందన్న టెండన్ డిటాచ్‌మెంట్...
టెండన్ డిటాచ్‌మెంట్ వల్ల కండరానికి, ఎముకకి మధ్య ఉండే కనెక్షన్ కట్ అవుతుంది. దాంతో మెదడు కండరాన్ని కదిలించమని సిగ్నల్ ఇచ్చినా అది ఎముకతో కనెక్ట్ లేకపోవడం వల్ల కాలు కదపలేని పరిస్థితి ఉంటుంది. అంతే కాకుండా భరించలేనంత నొప్పి కూడా ఉంటుందని ఇంటర్నెట్‌లో చూపిస్తుంది. తీవ్రమైన నొప్పి, వాపుతో పాటు, కాళ్లు కదపలేని పరిస్థితిలో రష్మిక ఉండి ఉంటుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెండన్ డిటాచ్‌మెంట్ అనేది పెద్ద సమస్య కాదు అనేది కొందరు అంటున్నారు. దానికి వైద్యం ఉన్న కారణంగా ఆందోళన అక్కర్లేదని, సరిగ్గా ఆరు వారాల బెడ్ రెస్ట్‌తో టెండన్ పూర్తిగా సెట్ అవుతుందని, ఇంతకు ముందు మాదిరిగా అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంటుందని కొందరు రష్మిక అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ రణబాలి సినిమా...
మొత్తానికి రష్మిక మందన్న టెండన్ డిటాచ్‌మెంట్ వల్ల కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఆమె ఈ లోపు పూర్తి చేయాల్సిన సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె రణబాలి సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సమయంలో రష్మిక ప్రమాదం కారణంగా ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇక మైస సినిమా విషయంలోనూ అదే జరగడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రష్మిక మందన్న ప్రమాదం, గాయం విషయం తెలిసిన వెంటనే విజయ్ దేవరకొండ హుటా హుటిన హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌లో ఆయన బాధతో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న త్వరగా రికవరీ కావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
