Begin typing your search above and press return to search.

అయ్య‌య్యో! దిశాప‌టానీ- జాక్విలిన్ బికినీ సీన్స్ క‌ట్.. ఏకంగా 18 సీన్లు లేపేసారు!

అయితే ఈ సినిమా రన్‌టైమ్‌పై హీరో అక్షయ్ కుమార్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రేక్షకులలో కాస్త గందరగోళాన్ని సృష్టించింది.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 11:29 PM IST
అయ్య‌య్యో! దిశాప‌టానీ- జాక్విలిన్ బికినీ సీన్స్ క‌ట్.. ఏకంగా 18 సీన్లు లేపేసారు!
X

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం `వెల్కమ్ టు ది జంగిల్` వచ్చే శుక్రవారం విడుదలకు సిద్ధమవుతూ.. తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీనివల్ల ఈ సినిమా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ సర్టిఫికేషన్ ప్రక్రియలో భాగంగా సినిమాకు పలు మార్పులు, చేర్పులు (ఎడిట్స్) తప్పలేదు. తాజా క‌థ‌నాల‌ ప్రకారం.. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడానికి ముందు ఈ చిత్రానికి సీబీఎఫ్‌సి ఏకంగా 18 కట్స్ సూచించింది. బోర్డు సిఫార్సుల మేరకు కొన్ని డైలాగ్‌లను మార్చడంతో పాటు, పలు పదాలు మరియు కొన్ని ప్రస్తావనలను మ్యూట్ చేయడం లేదా పూర్తిగా తొలగించడం చేశారు.

సెన్సార్ బోర్డు సూచించిన ఈ ఎడిట్స్‌లో కొన్ని గ్లామరస్ విజువల్స్ తొలగింపు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరోయిన్లు దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లకు సంబంధించిన కొన్ని బికినీ షాట్స్, క్లోజప్ విజువల్స్ - కొన్ని సీక్వెన్సులను ట్రిమ్ చేశారు. వీటితో పాటు నియమ నిబంధనల ప్రకారం ఎక్కడైతే అవసరమో అక్కడ యాంటీ-ఆల్కహాల్ (మద్యపాన వ్యతిరేక) హెచ్చరికలను కూడా జోడించారు. అయితే ఇన్ని మార్పులు చేసినా సినిమా నుండి తొలగించిన మొత్తం నిడివి కేవలం 10 సెకన్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ ఎడిట్స్ తర్వాత లాక్ చేసిన `వెల్కమ్ టు ది జంగిల్` ఫైనల్ రన్‌టైమ్ 165 నిమిషాలుగా (2 గంటల 45 నిమిషాలు) నిర్ధారణ అయింది. ఈ ఏడాది విడుదల కానున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్లలో ఇది అత్యంత సుదీర్ఘమైన చిత్రాలలో ఒకటిగా నిలవడంతో ఈ రన్‌టైమ్ ఇప్పుడు సినీ ప్రియులలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ సినిమా రన్‌టైమ్‌పై హీరో అక్షయ్ కుమార్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రేక్షకులలో కాస్త గందరగోళాన్ని సృష్టించింది. మొదట ఈ సినిమా నిడివి దాదాపు నాలుగు గంటల వరకు రాగా... ఆ తర్వాత దాన్ని బాగా తగ్గించామని అక్షయ్ పేర్కొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సినిమా రన్‌టైమ్ 145 నిమిషాలు అని ప్రస్తావించగా.. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం సినిమా నిడివి 165 నిమిషాలుగా ఉండటంతో అసలు రన్‌టైమ్ ఎంత అనే విషయమై చర్చ నడుస్తోంది. ఈ చిన్న కన్ఫ్యూజన్ పక్కన పెడితే.. ఎలాంటి పెద్ద అడ్డంకులు లేకుండా సినిమా సెన్సార్ క్లియర్ అవ్వడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్, భారీ తారాగణం, కామెడీ జోనర్ కావడం వల్ల పార్ట్ 3పైనా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు సెన్సార్ బోర్డు తొలగించిన గ్లామరస్ విజువల్స్ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయనే దానిపై ఇండస్ట్రీ విశ్లేషకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కట్స్ వల్ల కొన్ని ప్రాంతాల మార్కెట్లలో సినిమా వసూళ్లపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు ట్రేడ్ అనలిస్టులు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ తరహా సినిమాలకు కేవలం `వినోదం` మాత్రమే ప్రధాన బలమని, అది బాగుంటే ప్రేక్షకులు క‌చ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు.

దాదాపు రూ. 250-280 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ సవాలునే ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే వారం థియేటర్లలోకి రానున్న ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలంటే.. మొదటి రోజు వచ్చే పాజిటివ్ టాక్ ప్రేక్షకుల నుండి వచ్చే రివ్యూలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి.