Begin typing your search above and press return to search.

వాయిదా పడ్డ వెల్కమ్ టు ది జంగిల్ 3.. కొత్త డేట్ ఎప్పుడంటే?

గత సంవత్సరం ప్రకటించిన వెల్కమ్ ఫ్రాంచైజీ వెల్కమ్ -3 మూవీ అప్డేట్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Madhu Reddy   |   17 Sept 2025 6:00 AM IST
వాయిదా పడ్డ వెల్కమ్ టు ది జంగిల్ 3.. కొత్త డేట్ ఎప్పుడంటే?
X

బాలీవుడ్ మూవీ 'వెల్కమ్ టు ది జంగిల్ 3' ఈ సినిమాని జంగిల్ 3 అని కూడా అంటారు. భారీ తారాగణంతో వచ్చిన వెల్కమ్ 1, వెల్కమ్ 2 రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. దాంతో వెల్కమ్ 3 మూవీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.. అలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సడన్ గా ఆగిపోయింది.దానికి కారణం ఈ ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి, బడ్జెట్ వంటివి.. అయితే గత కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడడంతో చాలామంది ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా విడుదలపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు నటుడు పరేష్ రావల్.. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జంగిల్ -3 మూవీపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. మరి ఇంతకీ ఆయన ఇచ్చిన అప్డేట్ ఏంటి..? జంగిల్ 3 మూవీ ఎప్పుడు విడుదల కాబోతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గత సంవత్సరం ప్రకటించిన వెల్కమ్ ఫ్రాంచైజీ వెల్కమ్ -3 మూవీ అప్డేట్ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పరేష్ రావల్ మాట్లాడుతూ.. "అభిమానుల అంచనాలకు తగ్గట్టే జంగిల్ -3 ఉంటుంది. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నాటికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది" అంటూ గుడ్ న్యూస్ చెప్పారు.. అంతేకాదు జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయిందని,నవంబర్ లేదా డిసెంబర్లో తిరిగి షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. పరేష్ రావల్ ఇచ్చిన అప్డేట్ తో అభిమానుల్లో మళ్ళీ కొత్త ఆశలు కలుగుతున్నాయి..

ఈ సినిమా బడ్జెట్ కారణంగా ఆగిపోయిందనే రూమర్లు కూడా వినిపించాయి. కానీ దీనిపై దర్శకుడు, నిర్మాత స్పందించలేదు. అయితే తాజాగా పరేష్ రావల్ ఇచ్చిన అప్డేట్ తో ఈ సినిమా చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది విడుదల అవుతుందని చెప్పినప్పటికీ అభిమానులు ఈ సినిమా హిట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో గతంలో ఉన్న కొంతమంది నటీనటుల స్థానంలో వేరే వారిని చేర్చడంతో సినిమా హిట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ విమర్శలన్నీ సినిమాకి హైప్ పెరిగేలా చేస్తున్నాయని చిత్రయూనిట్ భావిస్తుంది.

జంగిల్ 3 మూవీ విషయానికొస్తే..అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో జ్యోతి దేశ్ పాండే, ఫిరోజ్ ఎ. నడియాద్వాలా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, రవీనాటాండన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్,దిశా పటాని,సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్,పరేష్ రావాల్, అర్షద్ వార్సీ, జానీ లివర్ వంటి భారీ తారాగణం ఉంది.. మరి చూడాలి 2026లో రాబోతున్న జంగిల్ -3 మూవీని అభిమానులు ఆదరిస్తారా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.