Begin typing your search above and press return to search.

ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజ్‌లు: టాప్ కంటెంట్!

ఈ వారం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల ముందు క్రేజీ కంటెట్ తో డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి.

By:  M Prashanth   |   30 July 2025 12:39 PM IST
ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజ్‌లు: టాప్ కంటెంట్!
X

ఈ వారం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల ముందు క్రేజీ కంటెట్ తో డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. గత వారం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నా, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టంతా కొత్తగా విడుదలవుతున్న సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’పై భారీ హైప్ నెలకొంది. ఈ వారం థియేటర్లలోనే కాదు, ఓటీటీ వేదికలపై కూడా మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌ల విడుదలతో మువీ లవర్స్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ అని చెప్పొచ్చు.

థియేటర్ రిలీజ్‌లు

ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో మొదటిది విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కింగ్‌డమ్’. భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా జూలై 31న వరల్డ్‌వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్, సాంగ్స్, ట్రైలర్ ద్వారా బజ్ బాగా పెరిగింది. విజయ్ వరుస ఫ్లాప్స్ తర్వాత వస్తుండటంతో ఈ సినిమా విజయం చాలా కీలకం.

ఇంకొకటి, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సర్ మేడమ్’. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది కానీ, అనివార్య కారణాల వల్ల తెలుగులోకి ఈ వారం రానుంది. తెలుగులో కూడా నటీనటులు ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో పాల్గొనడం విశేషం.

మరోవైపు, బాలీవుడ్ నుంచి ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ భారీ అంచనాలతో విడుదలకాబోతోంది. అజయ్ దేవగణ్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 2012లో వచ్చిన హిట్ సినిమా ‘సన్ ఆఫ్ సర్దార్’కు ఇది సీక్వెల్‌గా రూపొందింది.

రూరల్ లవ్ స్టోరీగా రూపొందిన ‘ఉసురే’ కూడా ఆగస్ట్ 1న విడుదల కానుంది. ఇందులో టీజే అరుణాచలం, జనని కునశీలన్ లీడ్ రోల్స్ చేశారు. గ్రామీణ ప్రేమకథల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మళ్ళీ కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఓటీటీ లో కూడా డిఫరెంట్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్:

గ్లాస్ హార్ట్ (వెబ్ సిరీస్) – జూలై 31

తమ్ముడు (తెలుగు సినిమా) – ఆగస్టు 1

జియో హాట్‌స్టార్:

పతి పత్ని ఔర్ పంగా (వెబ్ సిరీస్) – ఆగస్టు 2