Begin typing your search above and press return to search.

3 సినిమాల్లో ఏది హిట్టు బొమ్మ..?

వీకెండ్ సినిమాల హంగామాలో భాగంగా ఈరోజు 3 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

By:  Ramesh Boddu   |   7 Nov 2025 3:33 PM IST
3 సినిమాల్లో ఏది హిట్టు బొమ్మ..?
X

వీకెండ్ సినిమాల హంగామాలో భాగంగా ఈరోజు 3 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సుధీర్ బా బు జటాధర అంటూ ఒక థ్రిల్లర్ టైప్ సినిమా చేయగా రెండో సినిమా రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఈ రెండిటి మధ్యలో తిరువీర్ నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రిలీజైంది. ఐతే ఈ 3 సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుండగా వీటిలో ఏది ప్రేక్షకుల మనసులు గెలిచింది అన్నది క్లారిటీ వచ్చేసింది.

కామెడీ ఎంటర్టైనర్ గా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో..

కామెడీని ప్రధానంగా తీసుకుని ఒక కథ చెప్పదలచుకుంటే అది కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంతకుముందు చాలా సినిమాలు ఇదే పంథాలో వచ్చి సక్సెస్ అందుకున్నాయి. వాటి దారిలోనే తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నిలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్.. ఒక ఆహ్లాదకరమైన కామెడీ.. ఎవరికి వారు స్కోప్ దొరికినట్టుగానే చూపించిన అభినయం పడించిన కామెడీ ఇదంతా ప్రీ వెడ్డింగ్ షోకి కలిసి వచ్చింది.

ఈరోజు రిలీజైన సినిమాల్లో ఆడియన్స్ అందరి చేత సూపర్ అనిపించుకోవడంలో ఈ సినిమా ముందుంది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమాతో తిరువీర్ మరోసారి ఇంప్రెస్ చేశాడు. ప్రమోషన్స్ తోనే సినిమాపై ఒక పాజిటివ్ ఫీల్ తెప్పించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా థియేటర్ లో ఆడియన్స్ చేత నవ్వులు పూయిస్తుంది.

ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక షో..

ఇక ఈరోజు రిలీజైన సినిమాల్లో స్టార్ క్రేజ్ తెచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. సినిమా గురించి రిలీజ్ ముందు చాలా హంగామా చేశారు. ఐతే రష్మిక చేసిన పాత్ర వరకు ది బెస్ట్ అనిపించుకుంది. సినిమా కూడా చాలా వరకు వర్క్ అవుట్ అయ్యింది. ఐతే మాక్సిమం ఆడియన్స్ ఈ సినిమాను నచ్చినా ఎక్కడో కొంతమంది ఆడియన్స్ కి మాత్రం ఎక్కే ఛాన్స్ లేదు.

రాహుల్ రవింద్రన్ చెప్పాలనుకున్న పాయింట్ ని సిన్సియర్ గా చెప్పాడు. ఐతే పాయింట్ ఒక సైడ్ తీసుకున్నాడన్న డిస్కషన్ ఉన్నా.. కచ్చితంగా ఒక మేల్ డైరెక్టర్ గా రాహుల్ చేసిన అటెంప్ట్ మేజర్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అందులో భూమ పాత్రలో రష్మిక జీవించేసింది. దీక్షిత్ శెట్టి సపోర్టింగ్ కూడా ఉండటంతో ఇంప్రెస్ చేస్తుంది. రష్మిక క్యారెక్టరైజేషన్ ఆమె అభినయం కచ్చితంగా ఆమె ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈరోజు రిలీజైన సినిమాల్లో ఆడియన్స్ మొదటి ప్రిఫరెన్స్ ఈ సినిమాకే. నేషనల్ క్రష్ రష్మిక ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. ఐతే సినిమా కూడా ఆ రేంజ్ అంచనాలను అందుకున్నట్టే లెక్క.

సుధీర్ జటాధర ప్రయత్నం..

ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు నుంచి జటాధర సినిమా రిలీజైంది. ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేశారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచి ఆడియన్స్ లో కొన్ని అంచనాలు పెట్టుకున్నారు . టీజర్, ట్రైలర్ లో ఏదో భారీ అటెంప్ట్ చేసినట్టు అనిపించింది..

ఫైనల్ గా సినిమా చూశాక సుధీర్ బాబు ఎఫర్ట్ తప్ప మరోసారి ఆయన విఫల ప్రయత్నమే అనేలా ఉంది. జటాధర సినిమాపై ఏదైతే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదో సినిమా రిజల్ట్ కూడా అందుకు తగినట్టుగానే ఉంది. సుధీర్ బాబు ఖాతాలో మరో ఫెయిల్యూర్ గా జటాధర సినిమా నిలుస్తుంది.

సో అలా ఈరోజు రిలీజైన 3 సినిమాల్లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆడియన్స్ అందరి చేత సూపర్ అనిపించుకుంటుంటే.. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ కూడా సర్ ప్రైజ్ చేసింది. ఇక సుధీర్ బాబు జటాధర సినిమా మాత్రం మరోసారి మిస్ ఫైర్ అయ్యింది.