మిస్టరీ కామెడీ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది
హాలీవుడ్ సూపర్ నేచురల్ మిస్టరీ కామెడీ సిరీస్, వెడ్‌నెస్ డే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 6 Aug 2025 6:10 PM ISTహాలీవుడ్ సూపర్ నేచురల్ మిస్టరీ కామెడీ సిరీస్, వెడ్‌నెస్ డే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు కేవలం అమెరికాలోనే కాకుండా ఇండియన్ ఆడియన్స్ నుంచి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్ఫ్రెడ్ గోఫ్, మైల్స్ మిల్లర్ తెరకెక్కించిన వెడ్‌నెస్ డే అనే వెబ్ సిరీస్ లో జెన్నా ఒర్టెగా లీడ్ రోల్ లో నటించారు.
రెండు భాగాలుగా వెడ్‌నెస్ సీజన్2
వెడ్‌నెస్ డే మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సిరీస్ నుంచి సెకండ్ సీజన్ ఎప్పుడెప్పుడొస్తుందా అని అందరూ ఎంతగానో వెయిట్ చేశారు. అందరి ఎదురుచూపులకు తెర దించుతూ వెడ్‌నెస్ డే సెకండ్ సీజన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో రిలీజై ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మేకర్స్ ఈ సీజన్2 ను ఒకేసారి రిలీజ్ చేయకుండా దాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు.
ఆ సిరీస్‌ల దారిలోనే.
స్ట్రేంజర్ థింగ్స్, బ్రిడ్జిటన్, యు సిరీస్‌ల మాదిరిగానే ఈ సిరీస్ ను కూడా రెండు విడతలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందులో భాగంగానే బుధవారం వెడ్‌నెస్ డే కొత్త సీజన్ యొక్క పార్ట్1 ను నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. సీజన్ 2 పార్ట్ 1లో నాలుగు ఎపిసోడ్స్ ఉండగా అవి ఒక్కో ఎపిసోడ్ ఒక్కో గంట పాటూ నిడివితో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి.
సెప్టెంబర్ 3 నుంచి సీజన్2 పార్ట్2
ఈ సిరీస్ భారతీయ భాషలైన తెలుగు, తమిళ, హిందీలలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి. వెడ్‌నెస్ డే సీజన్2 ఫస్ట్ పార్ట్ బుధవారం రిలీజ్ కాగా, రెండో పార్ట్ కోసం ఆడియన్స్ ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 3 నుంచి వెడ్‌నెస్ డే సీజన్2 సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ కొత్త సీజన్ మొదటి సీజన్ లాగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.
