ఈ ఏడాది అత్యుత్తమ హారర్ సినిమా ఇదే
ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ మూవీ ప్రఖ్యాత `వార్నర్ బ్రదర్స్` నుంచి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... తెలిసిన సంగతులివి..
By: Sivaji Kontham | 26 Aug 2025 3:15 AM ISTప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డులు బ్రేక్ చేస్తోంది ఓ హారర్ సినిమా. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ మూవీ ప్రఖ్యాత `వార్నర్ బ్రదర్స్` నుంచి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... తెలిసిన సంగతులివి..
వార్నర్ బ్రదర్స్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇటీవల ఈ బ్యానర్ నుంచి వచ్చిన `ఫైనల్ డెస్టినేషన్- బ్లడ్ లైన్స్` సంచలన విజయం సాధించింది. థ్రిల్లర్ జానర్ లో గ్రిప్పింగ్ స్టోరి, స్క్రీన్ ప్లే తో సినిమా ఆద్యంతం రక్తి కట్టించింది. భారతదేశంలోను ఈ చిత్రం అద్భుత వసూళ్లను సాధించింది. ఈ ఏడాది విడుదలైన హాలీవుడ్ చిత్రాలలో ఈ సినిమా దేశవిదేశాల్లో అత్యధిక వసూళ్లతో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఇప్పుడు `వెపన్స్` చేరనుంది. ఇది హారర్ జార్ మూవీ. అమెరికాలో దేశీయంగా 278.5 మిలియన్ డలర్లు, ప్రపంచవ్యాప్తంగా 365 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20కోట్ల (200 మిలియన్ల) టికెట్లు అమ్ముడయ్యాయి. మూడు వారల పాటు అద్భుతమైన రన్ తో భారీ వసూళ్లు సాధించింది.
ఈ ఆర్ రేటెడ్ మూవీ 74 అంతర్జాతీయ మార్కెట్ల నుండి 13.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. జాక్ క్రెగ్గడర్ బార్బేరియన్ ని మించి ఇది భారీ వసూళ్లను సాధిస్తుండటం ఆసక్తికరం. అయితే ర్యాన్ కూగ్లర్ `స్పిన్నర్స్` కంటే `వెపన్` ఒక అడుగు వెనక ఉంది. వెపన్స్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించే చిత్రాల జాబితాలో చేరుతుందని కూడా ఒక అంచనా. ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్ 287.2 మిలియన్ డాలర్ల వసూళ్లతో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన హారర్ చిత్రంగా రికార్డులకెక్కనుంది. వెపన్స్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఏడో అత్యధిక వసూళ్ల సినిమాగా రికార్డులకెక్కింది. వార్నర్ బ్రదర్స్ లో మరపురాని విజయమిది. ఎ మైన్‌క్రాఫ్ట్ మూవీ, సూపర్‌మ్యాన్, F1: ది మూవీ వంటి వార్నర్ బ్రదర్స్ బ్లాక్ బస్టర్ల జాబితాలో చేరింది.
హారర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తగ్గడం లేదనడానికి వెపన్స్, స్పిన్నర్స్, ది బార్బేరియన్ వంటి చిత్రాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. హాలీవుడ్ తరహాలోనే బాలీవుడ్, సౌతిండియాలోను హారర్ జానర్ సినిమాలను తెరకెక్కించి మేకర్స్ విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
