వామిక గబ్బి DC లుక్: దోర దొండ పెదవుల నడుమ దోబూచీ
సరికొత్త కథాంశాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రస్తుత తరం నటి వామిఖ గబ్బి సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
By: Sivaji Kontham | 28 May 2026 7:00 AM ISTసరికొత్త కథాంశాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రస్తుత తరం నటి వామిఖ గబ్బి సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవల తన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన డిసి ట్రైలర్ నెటిజన్లను, సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా, ఇప్పుడు అదే మూవీ DC కి సంబంధించిన అప్‌డేట్స్ తో ఇంటర్నెట్‌ను వేడెక్కిస్తోంది. కేవలం ఒక్కటంటే ఒక్క ట్రైలర్‌తో థియేటర్లలో ఏ రేంజ్ గుబులు పుట్టించవచ్చో `డిసి` మేకర్స్ ప్రాక్టికల్‌గా నిరూపించారు. సరికొత్త విజువల్స్, ఊహించని కాంబినేషన్‌తో కట్ చేసిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలలో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మొదటిసారి హీరోగా నటిస్తుండటం విశేషం. ట్రైలర్‌లో లోకేష్ కనగరాజ్ - వామిక గబ్బి లు `దేవదాస్ - చంద్ర`లుగా ఒకరిని వీడి ఒకరు ఉండలేని గాఢమైన ప్రేమికులుగా కనిపిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రేమను గెలిపించుకునేందుకు వారు ఎంత దూరమైనా వెళ్లేందుకు.. చివరికి దారుణమైన క్రైమ్ చేయడానికి కూడా వెనకాడరని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ మేకింగ్ స్టైల్, యాక్షన్ ఎబిలిటీ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా బయటపడింది. లోకేష్ కనగరాజ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇండస్ట్రీకి ఒక కొత్త తరహా హీరోను పరిచయం చేస్తుండగా.. సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ వైబ్స్‌తో వస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి వామిఖ గబ్బి తన వంతు ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో బోలెడంత సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమా నుంచి ఒక అందమైన, అంతే వైల్డ్ పోస్టర్‌ని షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో వామిక తన పెదవుల మధ్య ఉంచిన ఎర్రటి గులాబీని ఎంతో హా*ట్‌గా ప్రదర్శిస్తోంది. చారెడేసి కళ్లు, తీరైన ముక్కు తీరు, దోర దొండ పెదవులతో ఊరించే ఈ పంజాబీ భామ.. అలా గులాబీని కరిచి పట్టుకున్న తీరుకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. సరిగ్గా ఇదే లుక్‌ని ట్రైలర్‌లో కూడా దర్శకుడు మాథేశ్వరన్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు.
`డిసి` ట్రైలర్‌లో వామిఖ గబ్బి కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా మునుపెన్నడూ చూడని విభిన్నమైన మాస్, వైల్డ్ లుక్స్‌లో కనిపించి షాకిచ్చింది. ఒకవైపు అమాయకమైన ప్రేమికురాలిగా కనిపిస్తూనే.. మరోవైపు శత్రువులపై వైల్డ్‌గా క్రైమ్ చేస్తూ గన్ షాట్స్‌తో భయపెడుతోంది. సమాజం నుండి.. శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతున్న ఈ లవ్ జంట.. అడ్డువచ్చిన వారిని అరాచకంగా కాల్చి చంపడం, కత్తులతో పొడిచేయడం వంటి యాక్షన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అసలు ఇంతటి వైల్డ్ ప్రేమకథ వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని పెంచేసింది.
ఈ విలక్షణమైన వైల్డ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా `డిసి` ఎప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్ర అధికారిక విడుదల తేదీని గ్రాండ్‌గా ప్రకటించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ క్రేజ్, వామిఖ గబ్బి అరాచకమైన నటన తోడైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
