Begin typing your search above and press return to search.

క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే వైజయంతీ మూవీస్ దే!

కానీ వైజయంతీ మూవీస్ మాత్రం ఈ రొటీన్ బిజినెస్ లెక్కలను ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఒకే రకమైన జానర్ కి పరిమితం కాకుండా ప్రతీ సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ క్రియేటివ్ ఫ్రీడమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది.

By:  M Prashanth   |   1 July 2026 12:14 PM IST
క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే వైజయంతీ మూవీస్ దే!
X

కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు ఒక టైప్ సినిమాతో హిట్ కొడితే, వరుసగా అదే ఫార్ములాతో సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాయి. లవ్ స్టోరీస్ క్లిక్ అయితే అవే లవ్ స్టోరీస్, మాస్ మసాలా వర్కౌట్ అయితే వరుసగా అవే యాక్షన్ సినిమాలు చేస్తుంటారు. కానీ వైజయంతీ మూవీస్ మాత్రం ఈ రొటీన్ బిజినెస్ లెక్కలను ఎప్పుడో పక్కన పెట్టేసింది. ఒకే రకమైన జానర్ కి పరిమితం కాకుండా ప్రతీ సినిమాతో కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ క్రియేటివ్ ఫ్రీడమ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది.

వాళ్లు చేసిన గత సినిమాల లైనప్ చూస్తే ఈ జానర్ షిఫ్టింగ్ ఎంత షార్ప్ గా జరిగిందో క్లియర్ గా అర్థమవుతుంది. ఎప్పుడో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం లాంటి ఫిలాసఫికల్ డ్రామాతో ఈ మార్పు మొదలైంది. ఆ తర్వాత సావిత్రి జీవితం ఆధారంగా మహానటి లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ బయోపిక్ ని తెచ్చారు. హీరోయిన్స్ బయోపిక్ లు ఆడవు అనే నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ వెంటనే జాతి రత్నాలు లాంటి ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర జాక్ పాట్ కొట్టేశారు.

ఇక అక్కడితో ఆగకుండా సీతా రామం లాంటి ఒక బ్యూటిఫుల్ పీరియడ్ లవ్ స్టోరీని జనాల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమా క్రియేట్ చేసిన క్లాసిక్ వైబ్స్ నుంచి బయటకు రాకముందే, ఏకంగా కల్కి 2898 ఏడీ అంటూ ఇండియన్ స్క్రీన్ పై ఇంతవరకు ఎవరూ ట్రై చేయని సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఒక విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ఈ సినిమాతో గ్లోబల్ స్టేజ్ పై టాలీవుడ్ కి మరింత గుర్తింపు తెచ్చారని చెప్పవచ్చు.

ఈ మధ్యనే వచ్చిన సింగ్ గీతం కూడా ఒక డిఫరెంట్ ప్రయోగమే. ఇలా ఒక జోనర్ నుంచి ఇంకో జోనర్ కి అసలు సంబంధం లేకుండా షిఫ్ట్ అవ్వడం వెనుక ఒక పెద్ద హోంవర్క్ ఉంటుంది. ఒక సినిమా అయిపోగానే దాన్ని మర్చిపోయి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఏళ్ల తరబడి కథను డెవలప్ చేస్తుంటారు. అయితే ఈ ప్రయాణంలో అన్ని సార్లు సక్సెస్ లు మాత్రమే రాలేదు. అన్నీ మంచి శకునములే, ఛాంపియన్ లాంటి ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి.

కానీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా కొత్త కథలు చెప్పాలనే వాళ్ల సిన్సియర్ ట్రైని ఎవరూ తప్పుబట్టలేరు. ఈ వైవిధ్యమైన ప్రయోగాల వల్ల డిజిటల్ మార్కెట్ లో కూడా వైజయంతీ మూవీస్ బ్రాండ్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ప్రతీ జానర్ లోనూ టెక్నికల్ స్టాండర్డ్స్ హై లెవెల్ లో మెయింటైన్ చేయడం వల్ల టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా వాళ్ల సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ కోసం భారీ రేట్లు ఆఫర్ చేయడానికి పోటీ పడుతున్నాయి. ఇక ఈ సక్సెస్ లో అశ్వినీ దత్ ధైర్యం ఎంత ఉందో అల్లుడు దర్శకుడు నాగ్ అశ్విన్ ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే అశ్వినీ దత్ కూతుర్లు స్వప్న, ప్రియాంక కూడా ప్రొడక్షన్ లో కీలకంగా వ్యవహరిస్తూ సంస్థ సక్సెస్ రేటును పెంచుతున్నారు.