కొత్త డైరెక్టర్ ఛాయిస్.. వైజయంతి మాస్టర్ ప్లాన్..!
వైజయంతి బ్యానర్ నుంచి ఒక కొత్త ఫిమేల్ సెంట్రిక్ సినిమా రాబోతుంది. ఆ సినిమా ప్లానింగ్ గురించి ఫిల్మ్ నగర్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది.
By: Ramesh Boddu | 7 Oct 2025 3:00 PM ISTవైజయంతి బ్యానర్ నుంచి ఒక కొత్త ఫిమేల్ సెంట్రిక్ సినిమా రాబోతుంది. ఆ సినిమా ప్లానింగ్ గురించి ఫిల్మ్ నగర్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. కొత్త దర్శకుడితో వైజయంతి మూవీస్ ఈ సినిమా చేస్తుందట. సినిమాలో హీరోయిన్ గా ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ నుంచి మహానటి సినిమా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ అవ్వడంతో ఈ సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. అందులోనూ న్యూ డైరెక్టర్ చెప్పిన కథ అయితే నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు. సినిమాలో ఏ హీరోయిన్ చేసినా కంటెంట్ పరంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందట.
వైజయంతి బ్యానర్ కమర్షియల్ సినిమాలు..
వైజయంతి బ్యానర్ సినిమాలు కూడా అంతే ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు చేస్తుంటారు. ఆ దారిలోనే కొత్త డైరెక్టర్ తో కొత్త సినిమా లాంచ్ చేయబోతున్నారట. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల, భాగ్య శ్రీ ఇద్దరి పేర్లు చర్చల్లో ఉన్నాయట. ఐతే సినిమాలో ఎవరు చేసినా సరే ఆ కథానాయికకు కచ్చితంగా మంచి పేరు వస్తుందని అంటున్నారు.
శ్రీలీల, భాగ్య శ్రీ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అన్నది త్వరలో తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు టైటిల్ గా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అని పెడుతున్నారట. టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక సినిమా కూడా అంతకుమించి ఉంటుందని చెప్పొచ్చు. శ్రీలీల విషయానికి వస్తే సౌత్ తో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. మోహిత్ సూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది అమ్మడు.
భాగ్య శ్రీ మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ..
ఇక భాగ్య శ్రీ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు కింగ్ డం తో వచ్చింది కానీ డిజప్పాయింట్ చేసింది. నెక్స్ట్ రాం తో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా వస్తుంది. కాంతా సినిమా కూడా నెక్స్ట్ రిలీజ్ కాబోతుంది. ఇవి చాలదు అన్నట్టు అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ చుక్కలు తెమ్మన్నా ఛాన్స్ వస్తే మాత్రం అమ్మడి లెవెల్ వేరే రేంజ్ కి వెళ్తుందని చెప్పొచ్చు.
భాగ్య శ్రీ, శ్రీలీల ఇద్దరిలో ఎవరికి ఈ అవకాశం వచ్చినా కూడా సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. ఐతే వైజయంతి బ్యానర్ ఈ సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. వైజయంతి బ్యానర్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ కాగా ఆ సినిమా రెండో భాగం కల్కి 2 సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నాగ్ అశ్విన్ బిజీగా ఉన్నాడు.
