Begin typing your search above and press return to search.

క్రేజీ డైరెక్ట‌ర్స్ సైలెన్స్‌కి కార‌ణం అదా?

టాలీవుడ్ మార్కెట్ లో పాటు భారీ సినిమాలు తీయ‌గ‌ల‌ద‌న్న స్కోప్‌ని క‌లిగించి స్టార్ డైరెక్ట‌ర్లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు.

By:  Ravindar Gorantla   |   24 March 2026 5:07 PM IST
క్రేజీ డైరెక్ట‌ర్స్ సైలెన్స్‌కి కార‌ణం అదా?
X

టాలీవుడ్ మార్కెట్ లో పాటు భారీ సినిమాలు తీయ‌గ‌ల‌ద‌న్న స్కోప్‌ని క‌లిగించి స్టార్ డైరెక్ట‌ర్లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. దాదాపు 20 నుంచి 24 ఏళ్ల క్రితం క్రేజీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఆక‌ట్టుకుని స్టార్‌డ‌మ్‌ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కులు చాలా వ‌ర‌కు ఈ మ‌ధ్య సినిమాల‌కు దూరంగా ఉంటూ మౌనం పాటిస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్ల‌తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు, ఇండ‌స్ట్రీ హిట్‌ల‌ని అందించిన ద‌ర్శ‌కులు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? మునుప‌టిలా స్టార్స్‌తో సినిమాలు ఎందుకు చేయ‌లేక‌పోతున్నారు? అన్న‌ది చాలా మంది మ‌దిని తొలిచేస్తోంది.

ఫ్యాక్ష‌న్ సినిమాల డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుక‌న్న వి. వి.వినాయ‌క్ నుంచి ఇద్ద‌రు ముగ్గురు డైరెక్ట‌ర్లు గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. సినిమాల కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. ఏ ప్రొడ్యూస‌ర్‌ని, స్టార్‌ని క‌ల‌వ‌డం లేదు. ఒక ద‌శ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన వారు ఇప్పుడు ఆ గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ స్పందించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్లడించిన‌ట్టుగా నెట్టింట ఓ పోస్ట్ ట్రెండ్ అవుతోంది.

ఈ పోస్ట్ సారాంశం ఏంటంటే `మ‌న‌కు కొత్త ఆలోచ‌న‌లు, ఐడియాలు లేన‌ప్పుడు పాత ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాలు చేయ‌డం కంటే మౌనంగా ఉండ‌ట‌మే మేలు. గ‌తంలో పాత ప‌ద్ద‌తుల్లో చేస్తే వ‌ర్క‌వుట్ అయింది అని దాన్నే ఫాలో అవుతూ ఇప్నుడు చేద్దామ‌నుకుంటే పొర‌పాటే. ప్రేక్ష‌కులు ఇప్పుడు మెరుగైన దాని కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాటినే ఇష్ట‌ప‌డుతున్నారు` అని తెలిపార‌ట‌. ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. దీనిపై నెటిజ‌న్‌లు స్పందిస్తూ వినాయ‌క్ క‌రెక్ట్‌గానే ఆలోచిస్తున్నార‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

అంతే కాకుండా `ఆదుర్స్` సీక్వెల్‌పై కూడా కామెంట్‌లు చేస్తున్నారు. దీనిపై వినాయ‌క్ ఓ ఇంట‌ర్వ్యూలో అన్న మాట‌లు కూడా ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆ సినిమా అక్క‌డితో అయిపోయింది. ఇంక దాంట్లో మ‌ళ్లీ సీక్వెల్ తియ్య‌డానికి ఏముంది? ఒక వేళ ఫోర్స్‌ఫుల్‌గా తీసినా అంత గొప్ప‌గా తియ్య‌గ‌లం అని నేను అనుకోవ‌ట్లేదు. దాన్ని అలాగే వ‌దిలేయడం బెట‌ర్‌` అని `అదుర్స్` సీక్వెల్‌పై వినాయ‌క్ కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ మాట‌లు విన్న వారంతా వినామ‌క్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడ‌ని, ఈ రోజుల్లో పాత ఐడియాల‌తో సినిమాలు చేస్తే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కామెంట్‌లు చేస్తున్నారు.

`అఖిల్‌` మూవీతో ఫామ్‌ని కోల్పోయిన వి.వి.వినాయ‌క్ `ఖైదీ నంబ‌ర్ 150`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చేసిన విష‌యం తెలిసిందే. అయితే `ఇంటిలిజెంట్‌` భారీ డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొరి సినిమాల‌కు దూర‌మైన వినాయ‌క్ ఐదేళ్ల విరామం త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో `ఛ‌త్ర‌ప‌తి`ని హిందీలో రీమేక్ చేయ‌డం, అది భారీ డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డంతో అప్ప‌టి డైరెక్ష‌న్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. తాజాగా మారిన ఇండ‌స్ట్రీ ప‌రిస్థితుల కార‌ణంగా ఆయ‌న మ‌ళ్లీ డైరెక్ష‌న్ చేసే అవ‌కాశాలు లేవ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.