Begin typing your search above and press return to search.

వీటీవీ గణేష్ తెలుగు డబ్బింగ్ ఇష్యూ.. పీఆర్ స్టంటా? నిజమేనా?

తెలుగులో డబ్ చేసే సమయంలో వీటీవీ గణేష్ వాయిస్‌ ను మార్చిన విషయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

By:  M Prashanth   |   19 Sept 2025 10:27 PM IST
వీటీవీ గణేష్ తెలుగు డబ్బింగ్ ఇష్యూ.. పీఆర్ స్టంటా? నిజమేనా?
X

కమెడియన్ వీటీవీ గణేష్ గురించి అందరికీ తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేని ఆయన.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి బీస్ట్ మూవీతో పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో ఒక్క డైలాగ్ తో తెలుగులో ఓ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు గణేష్.

ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, సింగిల్ సహా వివిధ తెలుగు చిత్రాల్లో నటించిన వీటీవీ గణేష్.. ఇప్పుడు అనేక సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు సుమారు 10 మూవీల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే రీసెంట్ గా తెలిపారు. ఇప్పుడు కిస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కెవిన్‌, ప్రీతి అస్రాని జంటగా నటించిన కిస్ సినిమాకు కొరియోగ్రాఫర్‌ సతీశ్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 19న విడుదలైంది. వీటీవీ గణేష్ కీలక పాత్ర పోషించిన ఆ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేసింది. అయితే తెలుగు ట్రైలర్ కు సంబంధించి వీటీవీ గణేష్ చేసిన కామెంట్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగులో డబ్ చేసే సమయంలో వీటీవీ గణేష్ వాయిస్‌ ను మార్చిన విషయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కిస్‌ మూవీ తెలుగులో తన గొంతు మార్చేశారని, ఇది కరెక్ట్‌ కాదని వ్యాఖ్యానించారు. తనకు తెలుగు వచ్చినట్లు చెప్పారు. రేపే డబ్బింగ్‌ చెప్పమన్నా చెప్తానని తెలిపారు. ఆ విషయాన్ని డైరెక్టర్ కు కూడా అడిగినట్లు పేర్కొన్నారు.

తన వాయిస్‌ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, తనకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నారని ఆరోపించారు. అదే సినిమాకు లేడీ డైరెక్టర్‌ అయ్యుంటే చెక్‌ చేస్తానని సరి చేసుకోవడానికి కచ్చితంగా ప్రయత్నించే వారని చెప్పారు. మేల్‌ డైరెక్టర్లు ఈజీగా తెలీదని అంటారని అసహనం వ్యక్తం చేశారు.

తన పాత్ర కోసం వేరే వాయిస్ ను ఉపయోగించడం తన కెరీర్ తోపాటు తెలుగు పరిశ్రమలో ఉన్న మంచి పేరు దెబ్బతీస్తుందని తెలిపారు. గణేష్ చేసిన కామెంట్స్ కు ప్రస్తుతం సోషల్ మీడియాలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఈ వివాదాన్ని మార్కెటింగ్ టాక్టిక్‌ గా, పీఆర్ స్టంట్ గా భావిస్తున్నారు. ఇంకొంతమంది తెలుగులో వాయిస్ మార్చడం తప్పు అని అభిప్రాయపడుతున్నారు.