ఒక్క డైలాగ్ తో ఫేమస్.. ఇప్పుడు చేతిలో 10 సినిమాలు..
సినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పలేం. కొందరు డెబ్యూతో ఫేమ్ సంపాదించుకుంటారు.
By: M Prashanth | 18 Sept 2025 12:09 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో చెప్పలేం. కొందరు డెబ్యూతో ఫేమ్ సంపాదించుకుంటారు. మరికొందరు కొన్ని సినిమాలు అయ్యాక మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ఇంకొందరు సడెన్ గా లైమ్ లైట్ లోకి వస్తుంటారు. ఆ కోవకే చెందుతారు కమెడియన్ వీటీవీ గణేష్.
కోలీవుడ్ లో ఆయనకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. తన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. అయితే ఆయనెవరో కూడా టాలీవుడ్ ఆడియన్స్ కు నాలుగేళ్ల క్రితం వరకు తెలియదు. కానీ సడెన్ గా ఫేమస్ అయిపోయారు. అది కూడా ఒక ఫ్లాప్ మూవీతో.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన బీస్ట్.. తెలుగులో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. కానీ సినిమాలో వీటీవీ గణేష్ చెప్పిన డైలాగ్ మాత్రం ఫుల్ ఫేమస్ అయిపోయింది. మీమర్స్ కు మంచి స్టఫ్ గా మారింది. ఒక సీన్ లో ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అంటూ డైలాగ్ చెబుతారు గణేష్.
అ డైలాగ్ కాస్త పాపులర్ అవ్వగా.. మీమ్స్ క్రియేట్ చేయడంలో తెగ వాడేశారు మీమర్స్. ఇప్పుడు కూడా వాడుతున్నారు. అలా ఒకే ఒక్క డైలాగ్ తోనే ఆయన తెలుగులో ఫేమస్ అయిపోయి అవకాశాలు అందుకున్నారు.. ఇప్పుడు అందుకుంటున్నారు కూడా. బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సహా అనేక చిత్రాల్లో యాక్ట్ చేశారు.
ఇప్పుడు దాదాపు 10 సినిమాల్లో నటిస్తున్నారు. అనేక మంది స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. బీస్ట్ లోని ఒకే ఒక్క డైలాగ్ తో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చిందని, టాప్ స్టార్లతో 10 సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు. అప్పుడు బీస్ట్ లో ఛాన్స్ ఇచ్చినందుకు విజయ్ కు థ్యాంక్స్ చెప్పారు.
అప్పుడు బీస్ట్ లో యాక్టర్ సతీష్ తో డైలాగ్ చెప్పిన వీటీవీ గణేష్.. ఇప్పుడు ఆయనతో కిస్ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న ఆదరణ కోసం మాట్లాడారు. టాలీవుడ్ డైరెక్టర్స్ ఎంతో ప్యాషనేట్ గా సినిమాలు తీస్తారని కొనియాడారు. తనను సొంత భాషా యాక్టర్ గా నే చూస్తున్నారని తెలిపారు.
