Begin typing your search above and press return to search.

నాగ చైతన్య ‘వృషకర్మ’.. వణుకు పుట్టిస్తున్న మిస్టరీ గ్లింప్స్

టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు చేశారు.

By:  M Prashanth   |   5 March 2026 1:25 PM IST
నాగ చైతన్య ‘వృషకర్మ’.. వణుకు పుట్టిస్తున్న మిస్టరీ గ్లింప్స్
X

టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు చేశారు. అయితే ఈసారి మాత్రం కంప్లీట్ రూట్ మార్చి ఒక విభిన్నమైన జోనర్‌లోకి అడుగుపెట్టారు. ‘విరూపాక్ష’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా గ్లింప్స్ విడుదలైంది.






ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, వణుకు పుట్టించే ఒక మిస్టరీ థ్రిల్లర్ అని క్లియర్ గా అర్థమవుతోంది. గ్లింప్స్ ఆరంభంలోనే చీకటి గదిలో ఎవరో పెయింటింగ్ వేస్తున్న విజువల్స్ సినిమాలో ఏదో పవర్ఫుల్ స్టోరీ లైన్ ఉన్నట్లు చూపిస్తున్నాయి. "అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు.." అంటూ వచ్చే వాయిస్ ఓవర్ కథలో ఏదో పెద్ద మిస్టరీ ఉందని హింట్ ఇస్తోంది.

ముఖ్యంగా ఒక వ్యక్తి భయంతో అరుస్తూ నేలపై పడిపోవడం, ఆపై అతని శరీరంలో నుంచి ఒక గబ్బిలం రావడం చూస్తుంటే దర్శకుడు కార్తీక్ దండు మరోసారి తన మేకింగ్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేయడం ఖాయమనిపిస్తోంది. వీడియోలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. "సృష్టి ధర్మం తప్పినప్పుడు.. విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది" అనే డైలాగ్ సినిమా కాన్సెప్ట్ మీద ఆసక్తిని పెంచుతోంది. నాగచైతన్య గెటప్ మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. పక్కా మాస్ యాక్షన్ లుక్‌లో చైతన్య తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా కొండలు ఎక్కడం, గుహల్లో అన్వేషణ చేయడం వంటి సీన్స్ చూస్తుంటే ఇది ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కలుగుతోంది. అలాగే ఎవరో రాక్షసుడు జనాలపై ఎగబడడం అతన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేశాడు అనే కోణంలో ఉండనున్నట్లు అర్ధమవుతుంది. ఈ గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవల్‌లో ఉంది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ ప్రతి సీన్‌ని ఎలివేట్ చేస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

సినిమాటోగ్రఫీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. సినిమాలో స్పర్ష్ విలన్ పాత్రలో కనిపిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎస్వీసీసీ బ్యానర్‌పై సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గ్లింప్స్ లోని విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది.

ఇక నాగచైతన్య ‘వృషకర్మ’తో బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. మిస్టరీ కథలకు భిన్నంగా, అతీంద్రియ శక్తులు లాంటి అంశాలతో వస్తున్న ఈ చిత్రం నేటి తరం ఆడియన్స్‌కు ఒక సరికొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందనడంలో సందేహం లేదు. విరూపాక్ష లాంటి హిట్ తర్వాత కార్తీక్ దండు ఈ సినిమాను ఎలా హ్యాండిల్ చేశారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.