హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై నరేష్.. శివాజీ పేరు ఎత్తకుండా..
రీసెంట్ గా హే భగవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. మూవీ టీమ్ అంతా అటెండ్ అయింది. ఆ ఈవెంట్ లో వాలెంటైన్స్ వీక్ సందడి కనిపించింది.
By: M Prashanth | 12 Feb 2026 6:09 PM ISTటాలీవుడ్ నటుడు శివాజీ కామెంట్స్ తో మొదలైన హీరోయిన్ల డ్రెస్సింగ్ వివాదం ఇటీవల కాస్త సద్దుమణిగింది. కొన్ని రోజుల పాటు కామెంట్స్.. విమర్శలు.. కౌంటర్స్.. పోస్టులతో హాట్ టాపిక్ గా కొనసాగింది. అయితే ఇప్పుడు సీనియర్ యాక్టర్ నరేష్.. శివాజీ పేరు ఎత్తకుండా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అవి సరదాగానే ఆయన చేసినా.. తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే?
రీసెంట్ గా హే భగవాన్ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. మూవీ టీమ్ అంతా అటెండ్ అయింది. ఆ ఈవెంట్ లో వాలెంటైన్స్ వీక్ సందడి కనిపించింది. ఆ సమయంలో యాంకర్ హగ్ డే ప్రస్తావన తీసుకురాగా.. నరేష్ స్టేజ్ పై సరదాగా మాట్లాడారు. అక్కడ ఉన్న పలువురు మేల్ సెలబ్రిటీస్ ను హగ్ చేసుకున్నారు. వారందరికీ హగ్ డే విషెస్ కూడా చెప్పారు.
ఆ తర్వాత హీరోయిన్ శివానిని హగ్ చేసుకోవడానికి వెళ్లి ఒక్కసారిగా వెనక్కి తగ్గుతూ.. అందరినీ నవ్వించారు. మిమ్మల్ని కూడా హగ్ చేసుకుందామని వచ్చానని తెలిపారు. అక్కడే ఉన్న శివానితోపాటు యాంకర్ కమ్ యాక్ట్రెస్ స్రవంతి చీరలు కట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల తర్వాత స్టేజ్ పై మహిళలు ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తున్నారని అన్నారు.
అందరూ శివాజీ మాట వింటున్నట్టున్నారు అంటూ పరోక్షంగా చెప్పారు. భారతీయ సంప్రదాయం ప్రకారం మగవాళ్లు.. ఆడవాళ్లను హగ్ చేసుకోకూడదని అన్నారు. అందుకే హీరోయిన్, యాంకర్ స్రవంతిని ఒకరినొకరు కౌగిలించుకోవాలని చెప్పడంతో అంతా నవ్వేశారు. శివాని, స్రవంతి కూడా నరేష్ చెప్పినట్లు హగ్ చేసుకుని నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
అయితే నరేష్ కామెంట్స్ పై అనేక మంది నెటిజన్లు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. కొందరు ఆయన కామెంట్స్ ను కేవలం కామెడీగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం హీరోయిన్ల డ్రెస్సింగ్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా హే భగవాన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నరేష్ కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, నరేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన రీసెంట్ గా నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడం గమనార్హం. దీంతో నరేష్ కు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పుడు హే భగవాన్ చిత్రంలో సుహాస్, శివాని నాగారం హీరోహీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిషోర్, స్రవంతి చొక్కారపు, నరేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.
