Begin typing your search above and press return to search.

మస్తీ 4 పబ్లిక్ టాక్..!

మిలాప్ జవేరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్రాద్ శివదాసాని లీడ్ రోల్ లో నటించారు.

By:  Ramesh Boddu   |   22 Nov 2025 2:25 PM IST
మస్తీ 4 పబ్లిక్ టాక్..!
X

బాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ వాటిని కూడా ఫ్రాంచైజీలుగా తీస్తుంటారు. అలాంటి వాటిలో మస్తీ ఫ్రాంచైజీ ఒకటి. మస్తీ సినిమా 2004లో వచ్చి సూపర్ హిట్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఆ తర్వాత గ్రాండ్ మస్తి 2013లో వచ్చి ఇంప్రెస్ చేసింది. ఇక అదే వరుసలో గ్రేట్ గ్రాండ్ మస్తి అంటూ 2016లో ఓ ప్రాజెక్ట్ వచ్చింది. ఐతే మళ్లీ 9 ఏళ్ల తర్వాత మస్తీ సినిమా నుంచి నాల్గవ ఫ్రాంచైజీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్రాద్ శివదాసాని..

మిలాప్ జవేరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్ ముఖ్, అఫ్రాద్ శివదాసాని లీడ్ రోల్ లో నటించారు. మస్తీ ఫ్రాంచైజీలో వీళ్లు మొదటి సినిమా నుంచి కొనసాగుతూనే ఉన్నారు. ఐతే మస్తీ సినిమా అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందులోనే కాస్త అడల్ట్ కామెడీ అనే టాక్ ఉంది. అందుకు తగినట్టుగానే ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నారు. లేటెస్ట్ గా వచ్చిన మస్తీ 4లో కూడా అలాంటి కథతోనే వచ్చింది.

పెళ్లైన ముగ్గురు వ్యక్తులు అమర్, మీట్, ప్రేమ్ లకు లవ్ వీసా అనే కాన్సెప్ట్ చెబుతాడు కామరాజ్ అనే ఫ్రెండ్. ఆ ఐడియాను వీళ్లు పాటించాలని అనుకోవడం దాని వల్ల వచ్చే సమస్యల్లో చిక్కుకోవడం దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే మస్తీ 4 కథ.

మస్తీ ఫ్రాంచైజీలకు ఉన్న క్రేజ్..

మస్తీ సినిమా ఫ్రాంచైజీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇలాంటి కాన్సెప్ట్ తోనే వీళ్లు వస్తారని ముందే ఊహించారు ఆడియన్స్. ఐతే కథ ప్రకారం జస్ట్ ఓకే అనిపించినా సినిమా నడిపించిన తీరు అంతగా ఆకట్టుకోలేదు. ఈ టైప్ సినిమాలు చూసే ఆడియన్స్ ఇలాంటి సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొంతమందికి మాత్రం ఇలాంటి కాన్సెప్ట్ లు అసలు రుచించవు.

మస్తీ నుంచి మస్తీ 4 వరకు ఈ ట్రియో తమ ఎఫర్ట్స్ తో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నమే చేస్తున్నారు. ఐతే ముందు 3 భాగాలకు కుదిరినట్టుగా మస్తీ 4లో కుదరలేదు. మస్తీ 4 ఒక విఫల ప్రయత్నమనే చెప్పొచ్చు. ఏదైతే మస్తీ లాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తారో అలాంటి ఆడియన్స్ కూడా పెద్దగా మెప్పించలేని స్టోరీ, స్క్రీన్ ప్లేతో మస్తీ 4 వచ్చింది. కామెడీతో ఏదో సర్కస్ లాంటిది చేద్దామనుకున్న మస్తీ 4 టీం ఎఫర్ట్ ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. మస్తీ ఫ్రాంచైజీల్లో మస్తీ 4 డిజప్పాయింటెడ్ మూవీ అని చెప్పొచ్చు. సినిమాలో కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆర్టిస్ట్, టెక్నిషియన్స్, మేకర్స్ పెట్టిన ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి.