Begin typing your search above and press return to search.

కొడుకు కోసం తలుపులు తట్టిన తండ్రి!

ఇండ‌స్ట్రీలో గాడ్ ఫాదర్ లేని కుటుంబం నుంచి వచ్చి స్టార్‌డమ్ సంపాదించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ లేదు.

By:  Srikanth Kontham   |   24 Aug 2026 8:45 AM IST
కొడుకు కోసం తలుపులు తట్టిన తండ్రి!
X

ఇండ‌స్ట్రీలో గాడ్ ఫాదర్ లేని కుటుంబం నుంచి వచ్చి స్టార్‌డమ్ సంపాదించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన‌ లేదు. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినా కూడా కెరీర్ ఆరంభంలో నటీనటులు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ తొలి సినిమా కోసం తన తండ్రి, నటుడు సురేష్ ఒబెరాయ్ పడిన కష్టాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

వివేక్ ఒబెరాయ్‌ను పరిశ్రమకు పరిచయం చేసే సమయంలో తాను పడిన శ్రమను సురేష్ ఒబెరాయ్ గుర్తు చేసుకున్నారు. కొడుకు కోసం ఆయన ఏకంగా దర్శకనిర్మాతల చుట్టూ ఇళ్లూ వాకిళ్లూ తిరుగుతూ తలుపులు తట్టిన రోజులను పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరున్నా? తన కుమారుడి ప్రతిభను నమ్మి అతనికి ఒక మంచి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎంతో మంది ప్రముఖులను నేరుగా కలిసి మాట్లాడినట్లు తెలిపారు.

కుమారుడు వివేక్ ఒబెరాయ్ తన సిఫార్సులతో కాకుండా తన సొంత ప్రతిభతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని సురేష్ ఒబెరాయ్ కోరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన `కంపెనీ` సినిమాతో వివేక్ ఒబెరాయ్ టాలీవుడ్‌లో ..బాలీవుడ్‌లో ఏకకాలంలో సంచలన విజయం సాధించారు. తొలి చిత్రంతోనే ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు దక్కడంతో పాటు ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా వరించాయి.

తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో వివేక్ ఒబెరాయ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. తండ్రి పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు వివేక్ తనదైన నటనతో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అప్పట్లో తండ్రీకొడుకుల అంకితభావం గురించి బాలీవుడ్ వర్గాల్లో ఎంతో చర్చ జరిగింది.

ఒక స్టార్ నటుడి తండ్రి అయి ఉండి కూడా తన కొడుకు కెరీర్ కోసం సాధారణ వ్యక్తిలా ప్రతీ ఒక్కరిని కలిసి మద్దతు కోరడం సురేష్ ఒబెరాయ్ గొప్పతనానికి నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు. ఇండస్ట్రీలో ఎదగడానికి టాలెంటెడ్‌తో పాటు కుటుంబం ఇచ్చే మానసిక స్థైర్యం ఎంత ముఖ్యమో? ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

మొత్తానికి వివేక్ ఒబెరాయ్ తొలి రోజుల ప్రయాణం -సురేష్ ఒబెరాయ్ పడిన తపన వెనుక ఉన్న ఎమోషనల్ జర్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కష్టపడాల్సిందేనని.. ఆ శ్రమే వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఈ ఉదంతం తెలియజేస్తోంది.