Begin typing your search above and press return to search.

స్పిరిట్ కాస్టింగ్.. అతని మీద గురి కుదిరిదంటే..?

ఇక స్పిరిట్ సౌండ్ టీజర్ లో సినిమా కాస్టింగ్ ని రివీల్ చేశాడు సందీప్ వంగ. ప్రభాస్ తో పాటు త్రిప్తి డిమ్రి జత కడుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది.

By:  Ramesh Boddu   |   25 Oct 2025 7:00 PM IST
స్పిరిట్ కాస్టింగ్.. అతని మీద గురి కుదిరిదంటే..?
X

యానిమల్ తర్వాత సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ ని ఇప్పటివరకు ఎవరు చూపించని విధంగా ఒక స్టైలిష్ మాస్ యాక్షన్ సినిమాగా స్పిరిట్ వస్తుంది. ఐతే స్పిరిట్ సినిమా నుంచి రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే రోజు ఒక సౌండ్ టీజర్ వచ్చింది. సందీప్ మార్క్ టీజర్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ అందించింది. ఐతే ఈ టీజర్ లో వీడియో లేకుండా ఆడియో ఉన్నా కూడా రెబల్ ఫ్యాన్స్ అరుపులు అనిపించేసిందని అంటున్నారు.

రెబల్ స్పిరిట్ లో వివేక్ ఒబెరాయ్..

ఇక స్పిరిట్ సౌండ్ టీజర్ లో సినిమా కాస్టింగ్ ని రివీల్ చేశాడు సందీప్ వంగ. ప్రభాస్ తో పాటు త్రిప్తి డిమ్రి జత కడుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నాడు సందీప్ వంగ. స్పిరిట్ కాస్టింగ్ లో వివేక్ పేరు చూసి బాలీవుడ్ ఆడియన్స్ సైతం సర్ ప్రైజ్ అయ్యారు.

బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్స్ లో వివేక్ ఒబెరాయ్ ఒకరు. టాలెంట్ ఎంత ఉన్నా ఆయన అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేదు. అంతేకాదు ఆయన చుట్టూ కాంట్రవర్సీలు కూడా కెరీర్ కు అడ్డుగా మారాయి. ఐతే సందీప్ వంగ యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించారు. యానిమల్ ముందు వరకు బాబీ పరిస్థితి కూడా చాలా ఇబ్బంది కరంగా ఉంది. ఎప్పుడైతే యానిమల్ టీజర్ వచ్చిందో అప్పటి నుంచే బాబీ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయింది.

యానిమల్ తో బాబీ డియోల్.. సందీప్ వంగ మాస్..

యానిమల్ తో బాబీ డియోల్ కి సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు సందీప్ వంగ. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ కాస్టింగ్ చూసి బాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా వివేక్ కి స్పిరిట్ సరైన సినిమా అవుతుందని అంటున్నారు. అప్పట్లోనే ఆర్జీవితో పనిచేసి మెప్పించిన వివేక్ ఒబెరాయ్ తర్వాత ఎందుకో తన రేంజ్ సినిమాలు చేయలేకపోయాడు. ఐతే యానిమల్ ఎలా అయితే బాబీ డియోల్ కి మంచి బ్రేక్ ఇచ్చిందో ప్రభాస్ స్పిరిట్ కూడా అదే రేంజ్ లో వివేక్ ఒబెరాయ్ కి క్రేజ్ తెస్తుందని అంటున్నారు.

ప్రభాస్ వర్సెస్ వివేక్ ఒబెరాయ్ అది కూడా సందీప్ వంగ మాస్ డైరెక్షన్ లో ఆడియన్స్ కి తప్పకుండా ఈ సినిమా ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. జస్ట్ స్పిరిట్ సౌండ్ టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటో చూపించిన సందీప్ వంగ తప్పకుండా యానిమల్ తర్వాత పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది.