'స్పిరిట్' పై వివేక్ ఓబెరాయ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మ్ంట్!
దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా వివేక్ ఓబెరాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
By: Ravindar Gorantla | 28 March 2026 6:30 PM ISTవెండితెరపై ఆకట్టుకున్న హీరోలు ఈ మధ్య హీరోలుగా విలన్‌లుగా పవర్ ఫుల్ క్యారెక్టర్లలో నటిస్తూ బ్లాక్ బస్టర్ మూవీస్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్‌గా నిలుస్తూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు. తమదైన మార్కు నటనతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ సరికొత్త ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో అలాంటి క్యారెక్టర్లకు, సీనియర్ హీరోలకు మంచి డిమాండ్ ఏర్పడుతూ వారికి క్రేజీ ఆఫర్లని తెచ్చి పెడుతున్నాయి. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన వారు కూడా ఒకే ఒక్క క్యారెక్టర్‌తో వైరల్ అవుతూ కెరీర్‌లో మళ్లీ దూసుకుపోతుండటంతో సీనియర్ స్టార్స్ ఇలాంటి క్యారెక్టర్లపై ఆసక్తిని చూపిస్తున్నారు.
కొన్నేళ్లు హీరోగా నటించి ఆ తరువాత వరుస ఫ్లాపులతో సినిమాలతో లాంగ్ బ్రేక్ ఇచ్చిసిన బాబి డియోల్ అనూహ్యంగా మళ్లీ లైమ్ లైట్‌లోకి రావడం తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మూవీ `యానిమల్`. రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో బాబి డియాల్ మూగ, చెవిటి వాడిగా ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో అత్యంత క్రూరుడైన వ్యక్తిగా నటించి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంలో వన్ ఆఫ్ ది పార్ట్‌గా నిలిచి ఆకట్టుకున్న బాబి డియోల్ ఈ మూవీతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలతో బిజీ స్టార్‌గా మారిపోయాడు. అబ్రార్ హక్ క్యారెక్టర్‌లో బాబి డియోల్ పలికించిన హావ భావాలు ప్రేక్షకులతో పాటు విమర్శకుల్ని సైతం షాక్‌కు గురి చేశాయి. ప్రస్తుతం బాబి డియోల్ `బందర్`, జన నాయగన్, ఆల్ఫా వంటి క్రేజీ సినిమాల్లోని కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. త్వరలో ఇవి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. బాబి డియోల్ తరహాలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు అక్షయ్ ఖన్నా.
దృశ్యం 2, ఛావా వంటి సినిమాల్లో నటించినా అక్షయ్‌కు `ధురంధర్`లో పోషించిన రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత అక్షయ్ ఖన్నాకు భారీ డిమాండ్ ఏర్పడటం, ఆ డిమాండ్ కారణంగానే `దృశ్యం 3` నుంచి అక్షయ్ తప్పుకోవడం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న `మహాకాళి`లో నటిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో వైరల్ అయ్యే అవకాశం వివేక్ ఓబెరాయ్‌కి లభించింది.
ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ రూపొందిస్తున్న మూవీ `స్పిరిట్`. త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కరుడు గట్టిన విలన్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సందర్భంగా వివేక్ ఓబెరాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. త్వరలోనే మీ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే అక్షయ్ ఖన్నాకు `ధురంధర్`లా, బాబి డియోల్‌కు `యానిమల్`లా `స్పిరిట్` మీకు కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందా? అని అడిగితే `పిక్చర్ అభీ బాకీహై మేరే దోస్త్`. ఇంకా చేయాల్సిన షూటింగ్ చాలానే ఉంది. నేను కేవలం అంకిత భావంతో, చిత్తశుద్దితో పనిచేయాలనుకుంటున్నాను. మిగతాది అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది` అంటూ ఆసక్తికరంగా స్పందించారు.
