కార్తీ లైనప్ లో తెలుగు డైరెక్టర్.. ఓ క్లారిటీ వచ్చేసింది
తెలుగు ప్రేక్షకులకు కార్తీ అంటే పరాయి హీరోలా అనిపించరు. మన పక్కింటి అబ్బాయిలాగే ఉంటారు.
By: M Prashanth | 10 Dec 2025 9:19 AM ISTతెలుగు ప్రేక్షకులకు కార్తీ అంటే పరాయి హీరోలా అనిపించరు. మన పక్కింటి అబ్బాయిలాగే ఉంటారు. అందుకే ఆయన సినిమాలు ఇక్కడ కూడా మినిమం గ్యారెంటీ వసూళ్లు సాధిస్తుంటాయి. ప్రస్తుతం కార్తీ నటించిన 'అన్నగారు వస్తారు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకలో కార్తీ చాలా ఉత్సాహంగా మాట్లాడారు. తన సినిమా విశేషాలతో పాటు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పిన విషయాలే. ముఖ్యంగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక యువ దర్శకుడితో సినిమా ఉండే ఛాన్స్ ఉందని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
'సరిపోదా శనివారం' సినిమాతో హిట్ కొట్టిన వివేక్ ఆత్రేయ, కార్తీకి ఒక కథ వినిపించారట. ఈ విషయాన్ని స్వయంగా కార్తీయే స్టేజ్ మీద బయటపెట్టారు. "వివేక్ ఆత్రేయ ఈ మధ్యే నాకు ఒక స్క్రిప్ట్ నెరేట్ చేశాడు. ఆయన గ్రేట్ రైటర్. ఆ కథ నాకు బాగా నచ్చింది. త్వరలోనే నెక్స్ట్ నెరేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని కార్తీ చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
నిజానికి ఈ మధ్య వివేక్ ఆత్రేయ, సూర్యను కలిశారని, ఆయనతో సినిమా చేయబోతున్నారని సోషల్ మీడియాలో ఒక టాక్ నడిచింది. కానీ ఇప్పుడు కార్తీ మాటలతో ఆ కథ అన్నయ్య సూర్య కోసం కాదని, కార్తీ కోసమే అని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. వివేక్ ఆత్రేయ లాంటి వైవిధ్యమైన దర్శకుడు, కార్తీ లాంటి వెర్సటైల్ యాక్టర్ కలిస్తే ఆ సినిమా అవుట్ పుట్ వేరే లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇక ఇదే ఈవెంట్ లో కార్తీ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 'ఖైదీ 2' సినిమా కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దానికి సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.
ఇప్పుడు కార్తీ మాటలతో ఆ ప్రాజెక్ట్ పై నమ్మకం మరింత పెరిగింది. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ ఇచ్చిన హింట్స్ తో రాబోయే రోజుల్లో సాలిడ్ లైనప్ ఉండబోతుందని అర్థమవుతోంది. ప్రస్తుతానికి మాత్రం డిసెంబర్ 12న వస్తున్న 'అన్నగారు వస్తారు' సినిమాతో కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
