Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ సెంటిమెంట్.. ర‌వితేజ కోసం మ‌ళ్లీ అదే హీరోయిన్ తో!

ఒక హీరోయిన్ తో వ‌ర్క్ చేసినప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్, డైరెక్ట‌ర్ విజన్‌ను ఆమె ఎంత వేగంగా అర్థం చేసుకుంటుందనే అంశాలపై క్లారిటీ వస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   20 Sept 2026 4:00 PM IST
డైరెక్ట‌ర్ సెంటిమెంట్.. ర‌వితేజ కోసం మ‌ళ్లీ అదే హీరోయిన్ తో!
X

వివేక్ ఆత్రేయ సినిమాల విషయంలో కథ ఎంత ముఖ్యమో, పాత్రలకు సరిపోయే నటీనటుల ఎంపిక కూడా అంతే కీలకంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు రవితేజతో ఆయన చేయబోతున్న కొత్త సినిమాకు ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఫిక్స్ అయింద‌ని వార్త‌లు వినిపించ‌డంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రియాంకతో సరిపోదా శనివారం సినిమా చేసిన వివేక్ ఆత్రేయ, మరోసారి ఆమెనే తన కథలోకి తీసుకోవడం వెనుక ఉన్న కారణాలపై ఇండస్ట్రీలో డిస్క‌ష‌న్ మొదలైంది. ఒకసారి కలిసి పనిచేసిన హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయడం కేవలం సెంటిమెంట్ కంటే, డైరెక్ట‌ర్ కు ఉన్న క్రియేటివ్ కంఫర్ట్ జోన్‌గా కూడా చూడొచ్చు.

ఒక హీరోయిన్ తో వ‌ర్క్ చేసినప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్, డైరెక్ట‌ర్ విజన్‌ను ఆమె ఎంత వేగంగా అర్థం చేసుకుంటుందనే అంశాలపై క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ఓరియెంటెడ్ స్టోరీల‌ను తెరకెక్కించే డైరెక్ట‌ర్ల‌కు ఇలాంటి వర్కింగ్ కెమిస్ట్రీ ఎంతో ఉపయోగపడుతుంది. సరిపోదా శనివారంలో చారులత పాత్రలో కనిపించిన ప్రియాంకకు వివేక్ ఆత్రేయ టేకింగ్‌పై ఇప్పటికే అవగాహన ఉండటంతో, కొత్త ప్రాజెక్ట్‌లో క్యారెక్ట‌ర్ ను మరింత ఈజీగా క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఆమె పాత్ర స్వరూపం ఎలా ఉండబోతోందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇదే సమయంలో టాలీవుడ్‌లో ఒక డైరెక్ట‌ర్ తనకు గతంలో కలిసి పనిచేసిన నటీనటులను తిరిగి ఎంపిక చేసుకునే ట్రెండ్ కూడా కనిపిస్తోంది. డైరెక్ట‌ర్ కు స‌గటు న‌టీన‌టుల బలాలు, లిమిట్స్ పై ముందుగానే అవగాహన ఉండటం, సెట్స్‌పై కమ్యూనికేషన్ వేగంగా సాగడం, పాత్రను తనకు కావాల్సిన విధంగా మలచుకోవడం వంటి అంశాలు దీనికి కారణాలుగా నిలుస్తాయి. ఈ ప‌రంగా చూసుకుంటే వివేక్ ఆత్రేయ- ప్రియాంక కాంబినేషన్ మరోసారి కలవడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ఇక రవితేజ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయోగానికి అవకాశం కల్పిస్తుందనే అంచనాలున్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో వివేక్ ఆత్రేయ తనదైన ట్రీట్‌మెంట్‌ను మిళితం చేయబోతుండటంతో హీరోయిన్ ఎంపిక కూడా కథకు తగ్గట్టుగానే జరిగి ఉండొచ్చనే డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. ఇరుముడి తర్వాత రవితేజ తన తర్వాతి సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్ ఆసక్తిని పెంచుతోంది. దసరా వీకెండ్‌లో పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్‌పై త్వ‌ర‌లోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.