కొత్త హీరో 'మత్స్య'.. నీళ్లలో ఉన్న సీక్రెట్ చేప స్టోరీ ఏంటి?
తెలుగు సినిమాకు వివాస్వాన్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రమే మత్స్య.
By: M Prashanth | 24 Sept 2026 2:36 PM ISTటాలీవుడ్ లోకి కొత్త హీరో ఎంట్రీ అంటే సాధారణంగా ఫైట్లు, భారీ ఎలివేషన్లతో గ్లింప్స్ మొదలవుతాయి. కానీ మత్స్య మూవీ మాత్రం ఆ ఫార్ములాకు భిన్నంగా కనిపిస్తోంది. స్టోరీలోని రహస్యాన్ని తీసుకొస్తూ.. నీటి అడుగున ఉన్న సరికొత్త వరల్డ్ ను పరిచయం చేస్తూ వచ్చిన ఆ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తెలుగు సినిమాకు వివాస్వాన్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న చిత్రమే మత్స్య.
రవి గోలి, తేజ కనకాల సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంహిత గణపతి ఇంటూరి గ్రాండ్ గా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ అడ్వెంచర్ గ్లింప్స్ ను విడుదల చేశారు. గ్లింప్స్ ను చూస్తే మత్స్య నార్మల్ అడ్వెంచర్ మూవీ కాదనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఓ చిన్న పిల్లాడు తన తల్లిని స్టోరీ చెప్పమని అడగడంతో వీడియో మొదలవుతుంది.
ఆమె ఓ రహస్యమైన చేప గురించి కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అక్కడి నుంచి గ్లింప్స్ ఒక్కసారిగా మరో వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. కలర్ ఫుల్ విజువల్స్, మిస్టరీతో నిండిన ఎన్విరాన్మెంట్, వాటర్ వరల్డ్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ తో సినిమాను చాలా కొత్తగా చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లింప్స్ లో వివాస్వాన్ కనిపించే విధానం ఆకట్టుకుంటోంది.
స్టైలిష్ లుక్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్, నేచురల్ యాక్టింగ్ తో డెబ్యూతోనే గుర్తింపు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే హీరో ఎంట్రీ కంటే కూడా సినిమాలో చూపించబోయే వరల్డ్ పైనే గ్లింప్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. పురాణ అంశాలు, రహస్యాలు, మాయాజాలం, సాహసాలతో కూడిన కథను ప్రేక్షకులకు పరిచయం చేసినట్లు కనిపిస్తోంది. దీంతో మత్స్య అసలు కథ ఏంటనే ఆసక్తి మొదలైంది.
గ్లింప్స్ లో చివర్లో వచ్చే భారీ తిమింగలం షాట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పడవ కింద నుంచి భారీ తిమింగలం వెళ్లే సీన్ సినిమాకు ఉన్న స్కేల్ ను చూపిస్తోంది. ఆ సన్నివేశంలో వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా స్పెషల్ గా కనిపించింది. వాటర్ వరల్డ్ ను స్క్రీన్ పై చూపించేందుకు మూవీ టీమ్ గట్టిగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. టెక్నికల్ గా కూడా మత్స్య మంచి రేంజ్ లో కనిపిస్తోంది.
విజువల్స్ తో పాటు ఉజ్వల్ గుప్తా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ కు మరింత స్ట్రెంత్ చేకూర్చింది. ముఖ్యంగా ప్రతి అల వెనుక ఒక రహస్యం దాగి ఉంటుందనే కాన్సెప్ట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. అలా కొత్త హీరోను పరిచయం చేస్తున్నప్పటికీ మత్స్య కేవలం హీరో షోగా కాకుండా ఒక కొత్త వరల్డ్ చూపించే సినిమాగా కనిపిస్తోంది. వివాస్వాన్ కు మరి ఎలాంటి హిట్ ఇస్తుందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.
