Begin typing your search above and press return to search.

తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్.. ఊహించని సర్ప్రైజ్ అందుకున్న జబర్దస్త్ బాబు!

ఒకప్పుడు తమదైన నటనతో, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు ఎల్దండి బలగం సినిమా చేసి డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నారు.

By:  Madhu Reddy   |   16 Oct 2026 3:01 PM IST
తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్.. ఊహించని సర్ప్రైజ్ అందుకున్న జబర్దస్త్ బాబు!
X

జబర్దస్త్.. పుష్కర కాలంగా బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకొని ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుని సినిమాలలో అవకాశాలను అందుకుంటూ మరింత బిజీగా మారిపోయారు. ఈ జబర్దస్త్ వేదికపై కామెడీ చేస్తూ నవ్వులు పంచిన ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాలలో హీరోలుగా, కమెడియన్స్ గా, దర్శకులుగా, నిర్మాతలుగా కూడా దూసుకుపోతున్నారు.

ఒకప్పుడు తమదైన నటనతో, కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు ఎల్దండి బలగం సినిమా చేసి డైరెక్టర్ గా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పెట్టి ఎల్లమ్మ అనే మరో పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరోవైపు అదిరే అభి కూడా కర్మాఖ్య అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అటు ధనరాజ్ కూడా రామం రాఘవం అనే సినిమా తీశాడు. ఇక అలాగే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాంప్రసాద్, ఇటు రచ్చ రవి , కిరాక్ ఆర్ పి వంటి వారు కూడా దర్శకులు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కామెడీ షో లో సందడి చేసిన రాకింగ్ రాకేష్ కూడా కేసీఆర్ అనే సినిమాను నిర్మించి నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు.

ఇప్పుడు ఈ జాబితాలోకి జబర్దస్త్ కమెడియన్ బాబు కూడా చేరారు . పోవే పోరా, జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో రచయితగా వందల ఎపిసోడ్స్ కి పనిచేసిన ఈయన.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కమెడియన్ గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఈ టీవీ విన్ లో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారి మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో వైవా హర్ష , జీవన్ కుమార్ , ఐశ్వర్య హోలక్కల్ , హైపర్ ఆది , విద్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. బ్యాచిలర్ బ్యాక్ డ్రాప్ తో కామెడీ ఎమోషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి కథాంశం తో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకోవడంతో.. త్వరలో సినిమా కూడా తీస్తానని బాబు చెప్పిన విషయం తెలిసిందే.

ఇకపోతే వైవా హర్ష తో వెబ్ సిరీస్ చేసి మంచి సక్సెస్ అందుకున్న బాబుకి వైవాహర్ష ఊహించని గిఫ్టు ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ ఈవెంట్లో వైవా హర్ష నీకేం కావాలో అడుగు అని ఆఫర్ ఇవ్వడంతో.. తన కోరికను బయటపెట్టాడు బాబు. ఇక దాంతో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైకును బాబుకి గిఫ్ట్ గా ప్రెసెంట్ చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు వైవా హర్ష. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మాట నిలబెట్టుకున్న హర్ష తొలి సక్సెస్ తోనే ఊహించని సర్ప్రైజ్ అందుకున్న బాబు ఇద్దరు కూడా వార్తల్లో నిలిచారు. మొత్తానికైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో తన కోరిక నెరవేరింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు బాబు.