విశ్వంభర ప్రమోషన్స్.. బెడిసికొడుతున్న డైరెక్టర్ ప్లాన్!
సినిమాకు మంచి ఆదరణ, హైప్ క్రియేటర్ చేయాలంటే ఇప్పట్లో ప్రమోషన్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి.
By: M Prashanth | 1 Aug 2025 1:00 AM ISTసినిమాకు మంచి ఆదరణ, హైప్ క్రియేటర్ చేయాలంటే ఇప్పట్లో ప్రమోషన్స్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. సినిమాపై ఎంత ఎక్కువ బజ్ క్రియేట్ చేయగలిగితే అంత ఎక్కువగా ప్రేక్షకుల్లోకి రీచ్ అవుతుంది. దానికి అంత మైలేజ్ వస్తుంది. ఈ మధ్య అయితే సినిమా ప్రారంభం నుంచే మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
అయితే, బింబిసార దర్శకుడు విశిష్ఠకు మాత్రం ఇది బెడిసికొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తాను తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా విశ్వంభర. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడం మాత్రం వశిష్ఠకు మిస్ ఫైర్ అవుతోంది. ఇవి సినిమాపై తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తైంది. అయినప్పటికీ మేకర్స్ ఇంకా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. రీసెంట్ గా ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో దర్శకుడు వశిష్ఠ వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఈ ఇంటర్వ్యూలు సినిమాపై హైప్ పెంచాల్సింది పోయి.. అంచనాలు తగ్గిస్తున్నాని అంటున్నారు.
దర్శకుడు వశిష్ఠ సినిమాకు సంబంధించి అనేక వివరాలను.. మరీ ముఖ్యంగా స్టోరీ ఏంటి, హీరో పాత్ర స్వభావం ఇలా ఇంపార్టెంట్ అంశాలను సినిమా విడుదలకు ముందే వెల్లడిస్తున్నారని చిరంజీవి అభిమానులు కలత చెందుతున్నారు. ఇలాంటి కీలకమైన కథాంశం, కీలకమైన ఎపిసోడ్‌లను బహిర్గతం చేయడం వల్ల సినిమాపై సస్పెన్స్, క్యూరియాసిటీ దెబ్బతీస్తున్నారని అభిమానులు వాదిస్తున్నారు.
అసలు కథ గురించే ఇప్పటికే అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు సినిమాపై ఉన్న బజ్ ను మరింత బలహీనపరుస్తున్నాయని వారు భావిస్తున్నారు. కొన్ని కొన్నిసార్లు సినిమా కథ గురించి మాట్లాడేటప్పుడు తక్కువే మట్లాడాలని అంటున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ మిస్ ఫైర్ అయ్యింది. వీఎఫ్ ఎక్స్ ఏదో అనుకుంటే, ఇంకేదొ అయ్యింది. ఇందులో విడువల్స్ లో క్వాలిటీ ఉన్నాయని ప్రేక్షకుల నుంచి కామెంట్లు రావడంతో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వీఎఫ్ ఎక్స్ కంపెనీని తొందరపెడ్డడంతోనే ఔట్ ఫుట్ ఇలా వచ్చిందని చెప్పారు. దీంతోనే రిలీజ్ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా చిత్రీకరణ పూర్తైనా విడుదల తేదీ చెప్పలేదు. ఇందులో చిరు సరసన అషిక రంగనాథ్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
