Begin typing your search above and press return to search.

హీరోగా తొలి ప్రయత్నంలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ వీళ్లే!

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. యాక్షన్ అని చెప్పే దర్శకులే మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి హీరోలుగా మారడం మనం చూస్తూనే ఉంటాం.

By:  Madhu Reddy   |   3 March 2026 9:00 PM IST
హీరోగా తొలి ప్రయత్నంలో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ వీళ్లే!
X

సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. యాక్షన్ అని చెప్పే దర్శకులే మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి హీరోలుగా మారడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, డైరెక్షన్ సీటు వదిలి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుని, మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన కొందరు టాలెంటెడ్ దర్శకుల గురించి మీకు తెలుసా? మెగాఫోన్ పట్టిన చేతులతోనే మెగా హిట్లు కొట్టి హీరోలుగా సెటిల్ అయిన ఆ స్టార్ డైరెక్టర్ల సక్సెస్ స్టోరీస్ ఇప్పుడు చూద్దాం..

క్రేజీ కాన్సెప్ట్‌లతో కట్టిపడేసిన యంగ్ డైరెక్టర్స్:

ప్రస్తుత తరం దర్శకుల్లో ప్రదీప్ రంగనాథన్ పేరు మారుమోగిపోతోంది. 'కోమాలి' సినిమాతో డైరెక్టర్‌గా సత్తా చాటిన ఈ కుర్రాడు, తన రెండో సినిమా 'లవ్ టుడే'తో హీరోగా మారిపోయాడు. యువతకు కనెక్ట్ అయ్యే కథతో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఇక మన తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా 'పెళ్లి చూపులు'తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. వీరు కేవలం డైరెక్షన్‌లోనే కాదు, యాక్టింగ్‌లో కూడా తమదైన మార్క్ చూపిస్తూ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.

లెజెండరీ దర్శకుల సంచలన అడుగులు:

ఒకప్పుడు డైరెక్టర్‌గా కల్ట్ క్లాసిక్ సినిమాలు తీసిన ఉపేంద్ర, ఎస్.జె. సూర్య వంటి వారు హీరోలుగా మారి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కన్నడ ఇండస్ట్రీలో తన మార్క్ డైరెక్షన్‌తో షేక్ చేసిన ఉపేంద్ర, అప్పట్లో 'A' సినిమాతో హీరోగా మారి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఇప్పటికీ ఆ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అలాగే తమిళంలో 'వాలి', 'ఖుషి' వంటి బ్లాక్‌బస్టర్లు తీసిన ఎస్.జె. సూర్య, 'న్యూ' అనే సినిమాతో హీరోగా మారి తన విలక్షణ నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రీసెంట్‌గా అభిషన్ జీవింత్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' తర్వాత 'జీవింత్ విత్ లవ్' చిత్రంతో హీరోగా మారి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

వారి సక్సెస్ సీక్రెట్ ఇదే:

ఈ డైరెక్టర్లందరూ హీరోలుగా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం వారికి సినిమాపై ఉన్న ఇష్టం. కథలో ఏ ఎమోషన్ పండుతుందో, ఆడియన్స్‌కి ఏం కావాలో వారికి బాగా తెలుసు. అందుకే వారు హీరోలుగా మారినప్పుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకుంటున్నారు. ఇక వీరు కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాకుండా హీరోలుగా వరుస అవకాశాలు అందుకుంటూ, అటు డైరెక్షన్‌ను ఇటు యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. డైరెక్టర్ విజన్ కలిగిన హీరోలు కాబట్టే వీరి సినిమాలు నాచురల్ కు దగ్గరగా ఉంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

దర్శకత్వం వహించడం ఒక ఎత్తు అయితే, కెమెరా ముందు నటిస్తూ మెప్పించడం మరో ఎత్తు. కానీ ఈ టాలెంటెడ్ డైరెక్టర్లు ఆ రెండు పడవల ప్రయాణాన్ని సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్నారు. అటు మెగాఫోన్ పట్టినా.. ఇటు మేకప్ వేసినా.. వారి లక్ష్యం మాత్రం ప్రేక్షకులను అలరించడమే.