Begin typing your search above and press return to search.

విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఇల్లు CG కాదు.. అసలు కథ ఇదే!

సోషల్ మీడియా లో ఓ యూజర్ ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్‌ను పరిశీలిస్తూ, అది నిజంగా ఇల్లేనా? కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ తో రూపొందించారా అంటూ క్యాజువ‌ల్ గా ఓ రీల్ ను పోస్ట్ చేశాడు.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Sept 2026 7:53 AM IST
విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఇల్లు CG కాదు.. అసలు కథ ఇదే!
X

ఒక సినిమా థియేటర్లలో రిలీజైన‌ప్పుడు ఆడియ‌న్స్ ఫోక‌స్ ఎక్కువగా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, డైరెక్ట‌ర్ టేకింగ్ వంటి అంశాలపైనే ఉంటుంది. అయితే అదే సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రతి ఫ్రేమ్‌ను జూమ్ చేసి పరిశీలించే అవకాశం పెరుగుతోంది. తాజాగా విశ్వనాథ్ & సన్స్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సినిమాలో కీలకంగా కనిపించే విశ్వనాథ్ ఫ్యామిలీ ఉండే ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో స్పెష‌ల్ డిస్క‌ష‌న్ కు కారణమైంది.

సోషల్ మీడియా లో ఓ యూజర్ ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్‌ను పరిశీలిస్తూ, అది నిజంగా ఇల్లేనా? కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ తో రూపొందించారా అంటూ క్యాజువ‌ల్ గా ఓ రీల్ ను పోస్ట్ చేశాడు. ఆ రీల్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో, సినిమా నిర్మాణంలో ఆ ఇంటిని ఎలా రూపొందించారనే అంశంపై ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియ‌న్స్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ పరిశీలించే అవకాశం ఉండటంతో ఇలాంటి నిర్మాణ వివరాలు కూడా డిస్క‌ష‌న్ లోకి వస్తున్నాయి.

అయితే ఈ ఇంటి విషయంలో సోషల్ మీడియాలో జరిగిన చర్చకు భిన్నమైన వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సినిమాలో ఆ ఇంటి లోపలి సీన్స్ కోసం మేక‌ర్స్ నిజమైన ఇంటిని ఉపయోగించలేదని, దానికోసం ప్రత్యేకంగా స్టూడియో ఫ్లోర్‌లో భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. కానీ బ‌య‌ట క‌నిపించే ఇంటి విజువ‌ల్స్ మాత్రం హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన లొకేషన్ అని తెలుస్తోంది. అంటే స్క్రీన్‌పై ఒకే ఇంటిగా కనిపించినా, దాని ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ వేర్వేరు ప్రదేశాల్లో రూపొందించినవన్నమాట.

దీంతో సోషల్ మీడియాలో మొదలైన సీజీ ఇల్లు డిస్క‌ష‌న్ కు మరో కోణం వచ్చింది. ఇంటి లోపలి భాగం కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదని, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ గా నిర్మించిన సెట్ అని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు డిస్క‌ష‌న్ టెక్నికల్ అంశం నుంచి డిజైన్ వైపు మళ్లింది. కొందరు ఆడియ‌న్స్ ఆ సెట్ డిజైన్ భారీగా, సాధారణ జీవనశైలికి దూరంగా కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజసమైన, ఫాంటసీ ప్రపంచాన్ని గుర్తుచేసే విజువల్ ట్రీట్‌మెంట్‌ను ఫ్యామిలీ ఉండే ఇంటికి ఆపాదించడం ఎంతవరకు సహజంగా ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా విశ్వనాథ్ & సన్స్ పై ఓటీటీ రిలీజ్ త‌ర్వాత డిస్క‌ష‌న్ కేవలం కథ, పాత్రల ఆలోచనలకే పరిమితం కాకుండా, సినిమా ప్రొడక్షన్ డిజైన్ వరకు విస్తరించింది. థియేటర్లలో పెద్దగా పట్టించుకోని చిన్న చిన్న విజువల్ డీటెయిల్స్ కూడా డిజిటల్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల విశ్లేషణలో భాగమవుతున్నాయి. దీంతో ఓటీటీ యుగంలో సినిమా మేకింగ్‌లో ప్రతి ఫ్రేమ్‌కు ఎంత ప్రాధాన్యం పెరిగిందో ఈ డిస్క‌ష‌న్ మరోసారి చూపిస్తోంది.