Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ముగించేశారుగా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా విశ్వంభ‌ర‌. బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాపై ముందు చాలానే అంచ‌నాలున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   1 Aug 2025 12:45 PM IST
మెగాస్టార్ ముగించేశారుగా!
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా విశ్వంభ‌ర‌. బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాపై ముందు చాలానే అంచ‌నాలున్నాయి. సోషియో ఫాంట‌సీ డ్రామాగా తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతో విశ్వంభ‌రతో చిరూ మ‌రోసారి హిట్ అందుకోవ‌డం ప‌క్కా అనుకున్నారంతా. కానీ మ‌ధ్య‌లో వ‌చ్చిన టీజ‌ర్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

వీఎఫ్ఎక్స్‌పై విమ‌ర్శ‌లు

టీజర్ లోని విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఆడియ‌న్స్ ను మెప్పించ‌క‌పోగా చిరాకు తెప్పించాయి. ఇంత నాసిర‌కం వీఎఫ్ఎక్స్ ఎక్క‌డా చూడ‌లేదంటూ టీజ‌ర్ రిలీజైన స‌మ‌యంలో విప‌రీత‌మైన విమ‌ర్శ‌లు రావ‌డంతో మేక‌ర్స్ ఏకంగా ఆ బాధ్య‌తల్ని మ‌రొక‌రికి అప్ప‌గించ‌డంతో సినిమా లేట‌వుతూ వ‌చ్చింది. దీంతో విశ్వంభ‌ర కోసం ఆడియ‌న్స్ ఎదురుచూపులు అలానే కొన‌సాగుతున్నాయి.

గ్యాప్ లో సెట్స్ పైకి మెగా157

ఆ ప‌నులు జ‌రుగుతుండ‌టంతో చిరూ ఖాళీగా ఉండ‌టం ఇష్టం లేక అనిల్ రావిపూడితో క‌లిసి మెగా157ను సెట్స్ పైకి తీసుకెళ్లి దాని షూటింగ్ ను ఎంతో ఫాస్ట్ గా పూర్తి చేస్తున్నారు. అయితే విశ్వంభ‌ర వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్ ఓ కొలిక్కి వ‌స్తుండ‌టంతో సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా పూర్తి చేయాల‌ని భావించి మేక‌ర్స్ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

బాలీవుడ్ భామ‌తో స్పెష‌ల్ సాంగ్

బాలీవుడ్ భామ మౌనీ రాయ్ తో ఓ స్పెష‌ల్ సాంగ్ తో పాటూ మ‌రికొంత టాకీ పార్ట్ ను కూడా షూట్ చేశారు. గురువారం(జులై 31)తో విశ్వంభ‌ర‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌వ‌డంతో గుమ్మ‌డికాయ కొట్టేశార‌ని తెలుస్తోంది. త్రిష‌, ఆషికా రంగ‌నాథ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, స్పెష‌ల్ సాంగ్ ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. యువి క్రియేష‌న్స్ విశ్వంభ‌రను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది.