Begin typing your search above and press return to search.

'విశ్వంభ‌ర‌' పై మ్యాసివ్ అప్‌డేట్.. మాస్ ఊగిపోవ‌డం గ్యారెంటీ!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'విడుదల పై చాలా కాలంగా స‌స్పెన్స్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   16 Aug 2026 4:00 PM IST
విశ్వంభ‌ర‌ పై మ్యాసివ్ అప్‌డేట్.. మాస్ ఊగిపోవ‌డం గ్యారెంటీ!
X

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'విడుదల పై చాలా కాలంగా స‌స్పెన్స్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇది మెగా ఫ్యాన్స్ లో అంత‌కంత‌కు అస‌హ‌నం పెంచుతోంది. అయితే ఈ ఎదురు చూపుల‌కు బ్రేక్ వేస్తూ, శుభ‌వార్త చెప్పేందుకు మెగా కాంపౌండ్ రెడీ అవుతోంద‌నేది తాజా వార్త‌. విశ్వంభ‌ర రాక‌పై అప్‌డేట్‌పై సోషల్ మీడియాలో పెద్ద‌ ఎత్తున చర్చ నడుస్తుండ‌గా, అభిమానులకు తీపి క‌బురు చెప్పేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదనేది గుస‌గుస‌. తాజాగా సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్న ఒక‌ పోస్ట్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ మాస్ అప్‌డేట్ త్వరలోనే హీట్ పెంచ‌బోతోంద‌ని.. విశ్వంభ‌ర 2027లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుందని రివీలైంది.

ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం...మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ ప్రియులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తమ ప్రియతమ నటుడి సినిమా అప్‌డేట్ రాబోతోందన్న వార్త కొందరికి ఎక్క‌డా లేని ఎన‌ర్జీని, ఉత్సాహాన్ని ఇస్తుంటే.. మరికొందరికి ఆ నిరీక్షణ సమయం ఎక్కువగానే అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌కు సంబంధించిన కామెంట్లు, మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అభిమానుల స్పందనలో ప్రధానంగా విభిన్నమైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. కొందరు ఫ్యాన్స్ 'బాస్ సునామీ రాబోతోంది', 'వైటింగ్ ఫర్ బాస్' అంటూ తమ ఆనందాన్ని, ఉత్సాహాన్ని కామెంట్లలో వెల్లడిస్తుంటే.. మరికొందరు మాత్రం 2027 నా! ఇంకా చాలా టైమ్ ఉందిగా! అంటూ అంత సుదీర్ఘకాలం డేట్ వ‌చ్చే వరకు వేచి చూడటంపై కొంత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

వీఎఫ్ఎక్స్ ప్రాధాన్య‌త‌తో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అభిమానుల కామెంట్లు నిరూపిస్తున్నాయి. ''కరెక్ట్‌గా ప్లాన్ చేసి దించండి సర్'' అంటూ కొందరు మేకర్స్‌కు సూచనలు ఇస్తుంటే... మరికొందరు ఎమోజీలతో ఎందుకు ఇంకా ఆల‌స్యం? అంటూ తమ నిరీక్షణను తెలియ‌జేస్తున్నారు. ఏది ఏమైనా `విశ్వంభర` ప్రాజెక్ట్‌కు ఉన్న క్రేజ్ ముందు ఈ సుదీర్ఘ నిరీక్షణ చిన్నదేన‌నేది ట్రేడ్ విశ్లేష‌ణ‌.

చిత్రబృందం నుంచి రాబోవు ఆ మాస్ అప్‌డేట్ ఏమై ఉంటుంది? అనేదానిపై ప్రస్తుతం ఇండస్ట్రీలో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. అది కొత్త‌గా క‌ట్ చేసిన‌ టీజర్ గ్లింప్సా లేక ఏదైనా బిగ్ సర్ ప్రైజా? రిలీజ్ తేదీని ఘ‌నంగా ప్ర‌క‌టించ‌డానికి వ‌చ్చే ఫ్లేమ్ అనుకోవాలా! అనేది తెలియాల్సి ఉంది. ఈ అప్‌డేట్‌తో విశ్వంభర ప్రమోషన్లు సరికొత్త ఊపు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నాలుగు నెల‌ల విస్త్ర‌త ప్ర‌చారం త‌ర్వాత జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా విశ్వంభ‌ర‌ను రిలీజ్ చేస్తార‌నే అంచ‌నా ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో ఉంది.