Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీ ఇంట సెంటిమెంట్ ని కొన‌సాగించేలా !

క‌మ‌ర్శియ‌ల్ సినిమా కాక‌పోవ‌డంతో క‌నెక్ట్ అవ్వ‌లేదు. అనంత‌రం `డాడీ` విజ‌యంతో మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చారు.

By:  Srikanth Kontham   |   4 Feb 2026 6:06 PM IST
మెగా ఫ్యామిలీ ఇంట సెంటిమెంట్ ని కొన‌సాగించేలా !
X

ఎట్ట‌కేల‌కు `విశ్వంభ‌ర` రిలీజ్ కు మోక్షం క‌లిగింది. రెండేళ్ల‌గా న‌లుగుతోన్న ప్రాజెక్ట్ జులై 9న ప్రేక్ష‌కుల ముందుకొ స్తుంది. దీంతో అన్న‌య్య అభిమానులంతా సంబురాల్లో మునిగి తేలుతున్నారు. వేస‌వి లో రిలీజ్ అయినా ఆ తాపాన్ని త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్టంగానే ఉండేది. అలాంటి ఇబ్బందులేవి లేకుండా స‌రిగ్గా వాతావ‌ర‌ణం కూల్ అయిన స‌మ‌యంలోనే రిలీజ్ ప్లాన్ చేయ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం. మ‌రి ప్ర‌త్యేకించి జులైలోనే రిలీజ్ ప్లానింగ్ వెనుక ఇంకేదైనా స్టోరీ ఉందా? అంటే అవున‌నే అనాలి. ఆ నెల మెగా ఫ్యామిలీకి ఎంతో క‌లిసొచ్చిన మాసంగా చెప్పాలి.అదే నెల‌లో మెగా ఫ్యామిలీ నుంచి రిలీజ్ అయిన చాలా సినిమాలు మంచి విజ‌యాలు సాధించిన చ‌రిత్ర ఉంది. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

స‌రిగ్గా 24 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా న‌టించిన `ఇంద్ర `రిలీజ్ అయింది. 2022 జులై 24న భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన చిత్ర‌మిది. అప్ప‌టికే న‌టసింహ బాల‌కృష్ణ రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్ స్టోరీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయారు. సింహం సీమ బ్యాక్ డ్రాప్లో న‌టించిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తే బాల‌య్య మాత్ర‌మే అర్హుడు అన్న‌ట్లు హ‌వా న‌డుస్తోంది. అప్ప‌టికి చిరంజీవి సాప్ట్ క్యారెక్ట‌ర్ల‌తో వెళ్తున్నారు. `అన్న‌య్య‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నా `మృగ‌రాజు`తో భారీ ప్లాప్ ఎదురైంది. దీంతో చిరు డివోష‌న‌ల్ స్టోరీ అయిన `శ్రీమంజునాధ‌`లో న‌టించారు.

క‌మ‌ర్శియ‌ల్ సినిమా కాక‌పోవ‌డంతో క‌నెక్ట్ అవ్వ‌లేదు. అనంత‌రం `డాడీ` విజ‌యంతో మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చారు. అటుపై `ఇంద్ర` హిట్ మెగా స్టార్ ఇమేజ్ నే మార్చేసింది. ప‌వ‌ర్ పుల్ డైలాగులు..క‌త్తుల‌తో శ‌త్రువుల‌పై తెగ‌బ‌డటం వంటి స‌న్నివేశాల‌తో మెగాస్టార్ సీమ నేప‌థ్యాన్ని సైతం ఆక‌ళింపు చేసుకున్నారు. కానీ ఆ త‌ర్వాత అదే నేప‌థ్యాన్ని చిరు కొన‌సాగించ‌లేదు. అలా చిరంజీవి కెరీర్ లో `ఇంద్ర` ఓ మైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. ఇదే నెల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఎంతో కీల‌క‌మైందిగా చెప్పొచ్చు. 1998 జులై 24న ప‌వ‌న్ హీరోగా న‌టించిన `తొలి ప్రేమ` రిలీజ్ అయింది.

ప‌వ‌న్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ హిట్. ప‌వ‌న్ ఇమేజ్ ని రెండింత‌లు రెట్టింపు చేసిన చిత్ర‌మిది. ఈ విజ‌యం త‌ర్వాత కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఆ మ‌రుస‌టి ఏడాది 1999లో `త‌మ్ముడు` జులై 15న రిలీజ్ అయింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా ప‌వ‌న్ ఇమేజ్ నే మార్చేసింది. ప్ర‌ధ‌మార్థంలో ప‌వ‌న్ అల్ల‌రి పాత్ర ఎలా క‌నెక్ట్ అవుతుందో? అంత‌కు మంచి బాక్సింగ్ రోల్ తో అద‌ర‌గొడ‌తాడు. ఈ విజ‌యాన్ని ప‌వ‌న్ కెరీర్ లో మ‌రో మైలురాయిగా చెప్పొచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ కు జులై మాసంతో విడ‌దీయ‌రాని బంధం ఆరంభంలోనే ఏర్ప‌డింది.

చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన రెండ‌వ చిత్రం `మ‌గ‌ధీర` జులై 31న ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయింది. అప్ప‌టికే ద‌ర్శ‌కుడిగా వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న రాజ‌మ‌యౌళికి `మ‌గ‌ధీర` ఏడ‌వ చిత్రం. డ‌బుల్ హ్యాట్రిక్ త‌ర్వాత ట్రిపుల్ హ్యాట్రిక్ కి పునాది వేసిన విజ‌యం అది. ఈ విజ‌యంతో రామ్ చ‌ర‌ణ్ టాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యాడు. చ‌ర‌ణ్ కెరీర్ లో తొలి వంద కోట్ల వ‌సూళ్ల చిత్ర‌మిదే. లాంగ్ ర‌న్ లో అప్ప‌ట్లో 170 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అలాగే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `ఫిదా` 2017 జులై 21న రిలీజ్ అయింది. అప్ప‌టికే వ‌రుస ప్లాప్ ల‌తో ఉన్నాడు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో రిలీజ్ అయిన `ఫిదా` వ‌రుణ్ కెరీర్ ని ట్రాక్ లోకి తెచ్చింది. 100 కోట్ల వ‌సూళ్ల‌కు ద‌గ్గ‌ర‌గా రీచ్ అయిన చిత్ర‌మిది. ఈ విజ‌యంతో వ‌రుణ్ కెరీర్ లో వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఇలా జులై మాసం మెగా హీరోల‌కు ఎన్నో విజ‌యాలు అందించింది.