విశ్వక్ లో మార్పు.. కదిలించనంత వరకూ!
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ కలిసి నటిస్తున్న మూవీ ఫంకీ. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు.
By: Madhu Reddy | 27 Jan 2026 11:00 PM ISTటాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కయాదు లోహర్ కలిసి నటిస్తున్న మూవీ ఫంకీ. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. తన అప్‌కమింగ్ మూవీ 'ఫంకీ' ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో నేను మారాను, కానీ నన్ను కావాలని కదిలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ అర్ధం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా వున్నాయి..
'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'ఫంకీ' (FUNKY). ఈ సినిమాలో 'డ్రాగన్' బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కా అనుదీప్ మార్క్ హ్యూమర్‌తో, సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలోనే ఒక సెటైరికల్ కామెడీగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 13, 2026న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, సుమ ఇంటర్వ్యూలో చిత్ర యూనిట్ చేసిన అల్లరి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విశ్వక్ సేన్ ఇంటర్వ్యూలో సుమ మీరు అప్పటిలో వీడియో తీసి, అని అనగానే, విశ్వక్ ఇప్పుడు అలా లేను, "నన్ను కదిలిస్తే ఊరుకోను"అని అంటాడు. ఇది వినగానే అందరికీ 2021-22 సమయంలో జరిగిన అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ వివాదమే గుర్తొస్తోంది. అప్పట్లో సినిమా ప్రమోషన్ కోసం ఆయన రోడ్డుపై చేసిన ఒక ప్రాంక్ వీడియోపై ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ పెట్టింది. ఆ సమయంలో యాంకర్ తనను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు విశ్వక్‌కు ఆగ్రహం తెప్పించాయి. ఆ గొడవలో "గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో" అని యాంకర్ అనడం, విశ్వక్ కూడా గట్టిగా సమాధానం చెప్పడం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే, తను ఎవరి జోలికి వెళ్లనని, కానీ తనపై విమర్శలు చేస్తే మాత్రం ధీటుగా బదులిస్తానని ఆయన తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
విశ్వక్ సేన్ సినిమాల కంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలకే క్రేజ్ ఎక్కువ. అనుదీప్ కేవీ లాంటి ఫన్నీ డైరెక్టర్‌తో జతకట్టడంతో 'ఫంకీ' ప్రమోషన్లు నవ్వుల విందుగా సాగుతున్నాయి. సుమ ఇంటర్వ్యూలో కూడా విశ్వక్ తన బాడీ లాంగ్వేజ్‌తో, కౌంటర్లతో సందడి చేశారు. ఇక హీరో కన్నా డైరెక్టర్ కు , నిర్మాతకు ఎక్కువ ఫాన్స్ వున్నారు అని విశ్వక్ సుమతో అనటం విశేషం. తన సొంత మార్క్ సినిమాల కోసం విశ్వక్ పడే తపన ఆయన మాటల్లో వినిపించింది. మొత్తానికి 'ఫంకీ' మూవీ విశ్వక్ కెరీర్‌లో ఒక విభిన్నమైన కామెడీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
