Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్.. నెక్స్ట్ ఎవరు?

ఇప్పుడు ఓ సినిమాను విశ్వక్ సేన్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ రెడ్డి తో వర్క్ చేయనున్నట్లు సమాచారం.

By:  M Prashanth   |   31 Oct 2025 3:00 AM IST
విశ్వక్ సేన్.. నెక్స్ట్ ఎవరు?
X

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండే హీరోల్లో ఆయన టాప్ ప్లేస్ లో ఉంటారనే చెప్పాలి. సొంత టాలెంట్ తో ఎదిగిన హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్.. విభిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలతో సందడి చేస్తుంటారు. గత ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. తన యాక్టింగ్ తో అందరినీ అలరించారు. రీసెంట్ గా లైలా మూవీతో థియేటర్స్ లో సందడి చేశారు మాస్ కా దాస్.

కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించిన విశ్వక్.. ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ తో వర్క్ చేస్తున్న సంగతి విదితమే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఫంకీ మూవీతో బిజీగా ఉన్నారు.

ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఆ సినిమాతో క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రానున్నారు. అయితే ఫంకీ మూవీ సెట్స్ పై ఉండగా.. నెక్స్ట్ చేయాల్సిన సినిమాలను లైన్ లో ఆయన పెడుతున్నారు. రీసెంట్ గా పలువురు డైరెక్టర్స్ తో వర్క్ చేస్తారని.. సినీ వర్గాల్లో టాక్ వినిపించినప్పటికీ ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇప్పుడు ఓ సినిమాను విశ్వక్ సేన్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ రెడ్డి తో వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల స్క్రిప్ట్ లైన్ ను మాస్ కా దాస్ కు నెరేట్ చేశారని వినికిడి. అయితే స్టోరీకి ఫిదా అయిన యంగ్ హీరో.. ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయమని చెప్పారట. దీంతో కిషోర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని వినికిడి.

ఫైనల్ నెరేషన్ అయిన తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. అప్పుడే సినిమాకు సంబంధించిన పలు వివరాలు కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే కిషోర్ రెడ్డి.. యంగ్ హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం మూవీతో డైరెక్టర్ గా మారారు. ఆ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కానీ ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఇప్పుడు విశ్వక్ సేన్ మూవీ పనులతో బిజీ అయ్యారు.