యాక్టింగ్ లో తోపు.. కానీ విశ్వక్ కు ఎందుకలా?
వైవిధ్యమైన కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ, ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే ప్రయత్నం చేసే హీరోల లిస్ట్ లో విశ్వక్ పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 16 Feb 2026 6:00 AM ISTవైవిధ్యమైన కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ, ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే ప్రయత్నం చేసే హీరోల లిస్ట్ లో విశ్వక్ పేరు కచ్చితంగా టాప్ లో ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. తనదైన స్టైల్, నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ ఇటీవల ఆయన సినిమాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదు.
రీసెంట్ గా విడుదలైన ఫంకీ మూవీ పరిస్థితి కూడా అదే రేంజ్ లో సాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి విశ్వక్ సినిమా అంటే యూత్ ఫుల్ ఎనర్జీ, వినూత్న కథ, రియలిస్టిక్ యాక్టింగ్ అని అంతా ఫిక్స్ అయ్యారు. గతంలో ఆయన చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా మాస్, యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
అయితే రీసెంట్ గా వచ్చిన సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాయి. తాజాగా వచ్చిన ఫంకీ మూవీపై కూడా మంచి హైప్ ఏర్పడింది. టైటిల్, పోస్టర్లు, ప్రమోషన్స్ చూసి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. కానీ థియేటర్లలో విడుదలైన తర్వాత మాత్రం రెస్పాన్స్ మిక్స్ డ్ గా వస్తోంది. స్టోరీ స్లోగా సాగడం, ఎమోషనల్ గా కనెక్షన్ తగ్గిపోవడం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు మైనస్ గా మారినట్లు అంతా చెబుతున్నారు.
కానీ ఒక విషయంలో మాత్రం అందరూ ఒకే అభిప్రాయానికి వస్తున్నారు. అది విశ్వక్ సేన్ యాక్టింగ్. ప్రతి సీన్ లో కూడా ఆయన తన రోల్ లో పూర్తిగా ఒదిగిపోయి నటించారని ప్రేక్షకులు చెబుతున్నారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఏదైనా సరే.. ఆయన వరకు ఆయన న్యాయం చేశారని కొనియాడుతున్నారు. అయితే యాక్టింగ్ సూపర్.. కానీ రిజల్ట్స్ ఎందుకలా? అనే విషయంపై డిస్కస్ చేసుకుంటున్నారు.
కొంతమంది అయితే స్టోరీల సెలెక్షన్ లో మరింత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. మంచి నటుడికి సరైన స్క్రిప్ట్ పడితేనే సక్సెస్ సాధ్యమవుతుందని అంటున్నారు. ప్రయోగాలు చేయడం మంచిదే కానీ, ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు కూడా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విశ్వక్ తన స్టైల్ ను వదిలిపెట్టకుండా కొత్త కథలను ట్రై చేయడం గ్రేట్ అని అభిమానులు చెబుతున్నారు.
ఒక్క హిట్ పడితే మళ్లీ ట్రాక్ లోకి వచ్చేస్తారనే నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొడుతున్న విశ్వక్ కు బాక్సాఫీస్ వద్ద మాత్రం అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇకపై ఆయన ఎంచుకునే కథలు, ప్రాజెక్టులు ఎలా ఉంటాయో చూడాలి. సరైన కథ దొరికితే మరోసారి భారీ విజయంతో ప్రేక్షకుల ముందుకొచ్చే స్టామినా విశ్వక్ లో ఉందని చెప్పడంలో నో డౌట్.
