Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ వన్ సైడ్ లవ్ స్టోరీ.. స్కూల్ లోనే అలా..

ఈవెంట్ లో యాంకర్ దీవానా వన్ సైడ్ లవ్ స్టోరీ కదా, మీకు అలాంటి క్రష్ మెమరీస్ ఉంటే చెప్పమని విశ్వక్ ను అడిగారు.

By:  M Prashanth   |   11 Jun 2026 3:55 PM IST
విశ్వక్ సేన్ వన్ సైడ్ లవ్ స్టోరీ.. స్కూల్ లోనే అలా..
X

హర్షిత్ రెడ్డి, స్నేహ జంటగా వస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ దీవానా. జూన్ 19న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ వేడుకలో విశ్వక్ తన రియల్ లైఫ్ లో జరిగిన ఒక ఫన్నీ లవ్ స్టోరీని షేర్ చేసుకుని అట్రాక్షన్ గా నిలిచాడు. సినిమాలో హీరో వన్ సైడ్ లవర్ గా కనిపించనున్నాడు కాబట్టి, దానికి కనెక్ట్ చేస్తూ విశ్వక్ తన స్టోరీ చెప్పాడు.

ఈవెంట్ లో యాంకర్ దీవానా వన్ సైడ్ లవ్ స్టోరీ కదా, మీకు అలాంటి క్రష్ మెమరీస్ ఉంటే చెప్పమని విశ్వక్ ను అడిగారు. దానికి నా లైఫ్ అంతా వన్ సైడే జరిగిపోయింది అంటూ నవ్వుతూ ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టాడు. టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దిల్ సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లో చదివే ఒక అమ్మాయిని భయంకరంగా వన్ సైడ్ లవ్ చేశానని చెప్పాడు. ఆ వయసులో చేసిన పనులు తలుచుకుంటే భలే ఫన్నీగా ఉంటుందని అన్నాడు.

ఆ స్కూల్ కు వెళ్లి ఆమెను చూడటానికి వాళ్ల నాన్న బైక్ ని దొంగతనంగా తీసుకెళ్లేవాడినని విశ్వక్ ఓపెన్ గా చెప్పాడు. అలా బైక్ తీసుకుని ప్రతి వారం ఆ అమ్మాయి స్కూల్ బయటకు వెళ్లి వెయిట్ చేసేవాడినని తన స్టోరీని బయటపెట్టాడు. ఏకంగా ఏడాది పాటు ఆ అమ్మాయి కోసం స్కూల్ చుట్టూ పిచ్చోడిలా తిరిగానని చెప్పాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ వన్ ఇయర్ లో ఒక్కసారి కూడా తను ఆ అమ్మాయితో మాట్లాడలేదట.

విశ్వక్ ఈ మాట చెప్పగానే ఈవెంట్ లో ఉన్నవాళ్ళంతా పగలబడి నవ్వారు. ఏడాది పాటు ఆమెను చూడటానికి వెళ్లినా, తన మనసులో మాట మాత్రం చెప్పలేదని అన్నాడు. వన్ సైడ్ అనగానే తనకు ఆ స్కూల్ మెమరీనే గుర్తొస్తుందని చెప్పాడు. పోనీ ఇప్పుడైనా ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారా అని యాంకర్ అడగగా, ఆ అమ్మాయికి అప్పటికే పెళ్లి కూడా అయిపోయిందని చెప్పి మరోసారి అందరినీ నవ్వించాడు.

తన వన్ సైడ్ లవ్ స్టోరీ అలా ఎండ్ అయిందని సరదాగా అన్నాడు. విశ్వక్ సేన్ చెప్పిన ఈ స్టోరీ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. యూత్ కు ఇలాంటి చిన్న క్రష్ స్టోరీస్ కామన్ కావడంతో, అతని మాటలకు చాలామంది కనెక్ట్ అవుతున్నారు. తన నిజ జీవిత అనుభవాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా అందరి ముందు షేర్ చేసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సింపుల్ ఫన్నీ స్టోరీ వల్ల దీవానా సినిమా ప్రమోషన్స్ కు కూడా ఫ్రీగా చాలా ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.

ట్రైలర్ లో కూడా హీరో తన ప్రేమ కోసం పడే ఆరాటం, వన్ సైడ్ లవ్ లో ఉండే ఎమోషన్స్ ను డైరెక్టర్ శ్రీకాంత్ బాగా హైలైట్ చేశారు. రియల్ లైఫ్ లో వన్ సైడ్ లవర్ గా మిగిలిపోయిన విశ్వక్ సేన్ వచ్చి సపోర్ట్ చేయడంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. ఇలాంటి యూత్ ఫుల్ కంటెంట్ ఈ జెనరేషన్ కు బాగా రీచ్ అవుతుంది. మరి దీవానా మూవీ జూన్ 19న ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.