సినిమా హిట్టయినా ఫ్లాపైనా సక్సెస్ మీట్లు.. మళ్లీ అగ్గి రాజేసాడు!
టాలీవుడ్‌లో ఫేక్ సక్సెస్ మీట్లపై గతంలో చేసిన వ్యాఖ్యలను హీరో విశ్వక్ సేన్ మరోసారి గుర్తుచేశారు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లు నిర్వహిస్తున్నారని గతంలో చేసిన కామెంట్ తన సినిమా గురించి కాదని సరదాగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘ENE Repeat’కు ప్రేక్షకాదరణ రావడంతో సక్సెస్ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు వసూళ్ల పోస్టర్లు, సక్సెస్ వేడుకల నిజాయితీపై టాలీవుడ్‌లో చర్చ కొనసాగుతోంది.
By: Sivaji Kontham | 21 Nov 2026 9:52 AM ISTహిట్టయినా ఫ్లాపైనా సక్సెస్ మీట్‌లు నిర్వహిస్తుంటారని గతంలో విశ్వక్ సేన్ ఒక వేదికపై కామెంట్ చేయగా దుమారం చెలరేగింది. అయితే ఈ కామెంట్ ని ఇంతకాలం తర్వాత మళ్లీ గుర్తు చేసుకుని.. ఇది తన సినిమా గురించి కాదని సరదాగా వ్యాఖ్యానించారు విశ్వక్ సేన్. ఇప్పుడు ఈఎన్ఈ చిత్రానికి ఆదరణ దక్కుతుండటంతో సక్సెస్ యాత్రకు వెళుతున్నామని కూడా తెలిపారు.
నిజానికి తెలుగు చిత్రసీమలో సక్సెస్ మీట్ కల్చర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రిలీజైన రెండో రోజే 200 కోట్ల క్లబ్ పోస్టర్లు కూడా వేస్తున్న మన నిర్మాతలు జెన్యూన్ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారా లేదా? అనేది ఎవరూ చెప్పలేరు. విడుదలైన రోజే జనం నుంచి గొప్ప ఆదరణ వస్తోందంటూ సక్సెస్ మీట్ పెట్టేస్తుంటారు. అందులో కూడా నిజం ఎంతో ఎవరికీ తెలీదు. తొలి వీకెండ్ ముగిసాక సోమవారం నుంచి ఆ సినిమా ఎలా ఆడుతుందో ఎవరికీ తెలీదు.
ట్రేడ్ వెల్లడించే లెక్కలకు.. చిత్రబృందం చేసే ప్రచారానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఇక్కడ ట్రేడ్ లెక్కలు లాభాల వాటాల ప్రాతిపదిక గురించి డీప్ గా తెలిసిన వారు మీడియాలో వెలువరించే లెక్కలు చూసి అవాక్కవుతారు.
నిజానికి తెలుగు చిత్రసీమలో ఈ సక్సెస్ మీట్ల హడావిడి.. వసూళ్ల పోస్టర్ల వెనుక ఉన్న వాస్తవాలపై ఎప్పటికప్పుడు విమర్శలొస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలైన రెండో రోజే వందల కోట్ల నంబర్ తో పోస్టర్లు వేయడం.. తొలి వీకెండ్ కూడా ముగియకముందే బ్లాక్‌బస్టర్ అంటూ వేడుకలు జరపడం ఒక సాధారణ ప్రమోషనల్ వ్యూహంగా మారిపోయింది. అసలు సోమవారం పరీక్ష దాటితేనే సినిమా అసలు స్థాయి ఏంటో తేలే పరిస్థితుల్లో.. ట్రేడ్ వర్గాలు చెప్పే వాస్తవ లాభనష్టాల లెక్కలకు.. చిత్రబృందం ప్రకటించే వసూళ్లకు ఏమాత్రం పొంతన ఉండటం లేదనేది బహిరంగ రహస్యం. బాక్సాఫీస్ వసూళ్లలో వాటాల గురించి లోతుగా తెలిసిన విశ్లేషకులు మీడియాలో వచ్చే అంకెలను చూసి విస్మయం వ్యక్తం చేస్తుంటారు.
ఈ తరహా ఫేక్ సక్సెస్ వేడుకలపై గతంలోనూ పలువురు అగ్ర తారలు-దర్శకులు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సినిమా విడుదలైన వెంటనే హడావిడిగా సక్సెస్ మీట్లు పెట్టడం కంటే.. బాక్సాఫీస్ వద్ద నిజమైన విజయం నమోదైన తర్వాతే సంబరాలు చేసుకోవాలని మహేష్ బాబు సూచించగా.. ప్రేక్షకుల తీర్పే అంతిమమని..థియేటర్ల వద్ద వచ్చే ఆదరణే సినిమా విజయాన్ని చెబుతుందని జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. నేచురల్ స్టార్ నాని, నిర్మాత దిల్ రాజు వంటి వారు సైతం ఈ ఈవెంట్లు కేవలం సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రమోషనల్ సాధనాలుగా మాత్రమే మారాయని..అసలైన సక్సెస్‌ను థియేటర్లలో లాంగ్ రన్ మాత్రమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. రాజమౌళి వంటి అగ్ర దర్శకులు చెప్పినట్లు ఫలితాన్ని నిజాయితీగా అంగీకరించినప్పుడే పరిశ్రమ విశ్వసనీయత నిలబడుతుంది. విశ్వక్ సేన్ మరోసారి ఈఎన్ఈ 2 ప్రెస్ మీట్ లో పాత విషయాన్ని గుర్తు చేసి అగ్గి రాజేసాడు. అయితే అప్పుడప్పుడు ఈ ఫేక్ సక్సెస్ మీట్లపై చర్చ సాగడం పరిశ్రమకు అవసరమే.
