Begin typing your search above and press return to search.

ఆ యంగ్ హీరోని జూ.ఎన్టీఆర్‌, బాల‌య్య గైడ్ చేస్తున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరోల‌ని చాలా ద‌గ్గ‌ర‌గా వాచ్ చేస్తుంటారు స్టార్ హీరోలు. వారికి కొన్ని చూచ‌న‌లు,స‌ల‌హాలు కూడా ఇస్తుంటారు.

By:  Tupaki Entertainment Desk   |   7 Feb 2026 1:23 PM IST
ఆ యంగ్ హీరోని జూ.ఎన్టీఆర్‌, బాల‌య్య గైడ్ చేస్తున్నారా?
X

టాలీవుడ్ యంగ్ హీరోల‌ని చాలా ద‌గ్గ‌ర‌గా వాచ్ చేస్తుంటారు స్టార్ హీరోలు. వారికి కొన్ని చూచ‌న‌లు,స‌ల‌హాలు కూడా ఇస్తుంటారు. కొన్ని త‌ప్పులు చేస్తే మ‌ళ్లీ అలాంటి పొర‌పాట్లు చేయ‌కండ‌ని హెచ్చ‌రిస్తూ గైడ్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం యంగ్ హీరో మాస్ కా దాస్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. విశ్వ‌క్‌సేన్ గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. `దాస్ క ధ‌మ్కీ` త‌రువాత వ‌రుస‌గా మూడు ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. ఇందులో `లైలా` కోసం చాలా వ‌ర‌కు శ్ర‌మించాడు.

ఫ‌స్ట్ టైమ్ లేడీ గెట‌ప్ వేసి రిస్క్ చేసినా కూడా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్‌, బాల‌య్య ..విశ్వ‌క్‌సేన్‌ని గైడ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్ద‌రితో విశ్వ‌క్‌కు మంచి అనుబంధం ఉంది. మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. విశ్వ‌క్‌కు వీరితో పాటు యంగ్ హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌తోనూ మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల `లైలా` ఫ్లాప్ త‌రువాత విశ్వ‌క్ సేన్‌కు ఎన్టీఆర్‌, నంద‌మూరి బాల‌కృష్ణ ఓ స‌ల‌హా ఇచ్చార‌ట‌. మ‌రోసారి `లైలా` త‌ర‌హా సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని, ,అలాంటివి అటెంమ్ట్ చేయొద్ద‌ని గ‌ట్టిగా చెప్పార‌ట‌.

ఈ విష‌యాన్ని హీరో విశ్వ‌క్‌సేన్ `లైలా` ఫ్లాప్ త‌రువాత నిజాయితీగా ఓ ప్ర‌క‌ట‌న చేశాడు. ఇక‌పై `లైలా` త‌ర‌హా సినిమాలు చేయ‌కూడ‌ద‌ని, స్క్రిప్ట్‌ల ఎంపిక విష‌యంలో మంచిత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ సూచించార‌ని తెలిపాడు. అయితే ఎన్టీఆర్‌, బాల‌య్య త‌న‌పై ఉన్న ప్రేమ‌తోనే అలా చెప్పార‌ని కూడా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌, బాల‌య్య మాట‌ల‌ని సీరియ‌స్‌గా తీసుకున్న విశ్వ‌క్‌సేన్ త‌న త‌దుప‌రి సినిమాతో స్ట్రాంగ్‌గా క‌మ్ బ్యాక్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నాడు.

విశ్వ‌క్‌సేన్ న‌టిస్తున్న లేటెస్ట్ కామెడీ రొమాంటిక్ డ్రామా `ఫంకీ`. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ప్ర‌చార చిత్రాల‌తో ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల్ని పెంచేసింది. `జాతిర‌త్నాలు` త‌రువాత ఆ స్థాయి బ‌జ్‌ని ఈ మూవీ సొంతం చేసుకోవ‌డంతో మ‌ళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుంద‌ని అంతా భావిస్తున్నారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేయ‌డంతో మేక‌ర్స్ ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

2 గంట‌ల 8 నిమిషాల నిడివితో సాగే ఈ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ బ‌లంగా న‌మ్ముతున్నారు. సినిమా రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్‌ని త్ర‌వ‌లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాలు బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.