లైలా.. ఆమె రియాక్షన్ గురించి విశ్వక్..!
రొటీన్ కి భిన్నంగా ఈ తరం యువ హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో లేడీ గెటప్ లో విశ్వక్ చేసిన ప్రయత్నమే లైలా.
By: Ramesh Boddu | 27 Jan 2026 10:42 AM ISTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ చేసిన లైలా సినిమా రిజల్ట్ తెలిసిందే. రొటీన్ కి భిన్నంగా ఈ తరం యువ హీరోల్లో అన్ని రకాల పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ క్రమంలో లేడీ గెటప్ లో విశ్వక్ చేసిన ప్రయత్నమే లైలా. ఈ సినిమా విషయంలో విశ్వక్ సేన్ అంచనాలు అన్నీ తప్పాయి. ఐతే తన ప్రతి సినిమా విషయంలో ఎంతో కష్టపడి బెస్ట్ అవుట్ పుట్ వచ్చేందుకు ప్రయత్నించే విశ్వక్ సేన్ తన చివరి మూడు నాలుగు సినిమాల విషయంలో ట్రాక్ తప్పాడు.
అనుదీప్ తో విశ్వక్ సేన్ ఫంకీ..
విశ్వక్ సేన్ నెక్స్ట్ అనుదీప్ తో కలిసి ఫంకీతో రాబోతున్నాడు. అనుదీప్ తో సినిమా అంటే యూత్ ఆడియన్స్ కి కచ్చితంగా సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించే ఛాన్స్ ఉంటుంది. ఫంకీ టీజర్ తోనే సినిమాపై హైప్ తెచ్చారు. ఐతే ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్బంగా రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ తన ప్రతి సినిమా చూసిన తర్వాత తన మదర్ చాలా మురిసిపోయేదని అన్నారు.
ఐతే లైలా సినిమా చూసిన తర్వాత మాత్రం ఆమె జాలి పడ్డారని చెప్పాడు విశ్వక్ సేన్. సో అమ్మ కాబట్టి అంతకుమించి ఏమి చేయలేదు. సో లైలా సినిమా మిస్ ఫైర్ అయ్యిందని తనకు అర్థమైందని అన్నాడు విశ్వక్ సేన్. ఐతే ఫంకీతో మళ్లీ తను కంబ్యాక్ ఇస్తానని చాలా నమ్మకంగా ఉన్నాడు విశ్వక్ సేన్. ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. డ్రాగన్ సినిమాతో అమ్మడు యూత్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో ఆల్రెడీ శ్రీవిష్ణుతో ఒక సినిమా చేసినా ఆ టైంలో మన వాళ్లు పట్టించుకోలేదు. ఐతే డ్రాగన్ తర్వాత తెలుగులో కూడా కయదు లోహర్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.
జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్..
విశ్వక్ సేన్, కయదు లోహర్ ఈ జోడీ ఫంకీకి ప్లస్ కానుంది. విశ్వక్ కూడా ఇక మీదట తన సినిమాల విషయంలో మరింత ఫోకస్ తో పనిచేయాలని ఫిక్స్ అయ్యాడు. ఫంకీ తో హిట్ ట్రాక్ ఎక్కి నెక్స్ట్ కాంబినేషన్స్ తో కూడా అదే సక్సెస్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.
జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. విశ్వక్ ఫంకీతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని నవ్వించడానికి వస్తున్నాడు. విశ్వక్ మాస్ ఇమేజ్ కి అనుదీప్ కామెడీ స్క్రీన్ ప్లే ఎలా వర్క్ అవుట్ అవుతుంది అన్నది ఈ ప్రేమికుల రోజు సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది.
