విశ్వక్ ఫంకీ.. గట్టిగా కొట్టాల్సిందే..!
విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాతో వచ్చాడు. 3 సినిమాలు మంచి హైప్ తో రిలీజైన ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు.
By: Ramesh Boddu | 16 Dec 2025 7:00 PM ISTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ ఫంకీ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాను అనుదీప్ కెవి డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ హిట్ సినిమా డ్రాగన్ హీరోయిన్ కయదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వక్ సేన్ ఫంకీ సినిమా నుంచి కొద్దిరోజుల క్రితం ఒక టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూస్తేనే మరోసారి అనుదీప్ తన మార్క్ మూవీతో వస్తున్నాడని అనిపిస్తుంది. ఐతే విశ్వక్ సేన్ ఫంకీ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో విశ్వక్ సేన్..
విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాతో వచ్చాడు. 3 సినిమాలు మంచి హైప్ తో రిలీజైన ఆశించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంతమేరకు బెటర్ అనిపించినా మిగిలిన రెండు డిజప్పాయింట్ చేశాయి. ఇక ఈ ఇయర్ మొదట్లో లైలా సినిమాతో వచ్చాడు విశ్వక్ సేన్. ఆ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ఫంకీ మాత్రం మంచి బజ్ తో వస్తుంది. సినిమాను అనుదీప్ ఎప్పటిలానే తన కామెడీ పంచులతో పాటు ఫీల్ గుడ్ స్టోరీతో వస్తున్నారట. ఐతే యువ హీరోల్లో మంచి పొటెన్షియల్ ఉన్నా రేసులో వెనకపడుతున్నాడు విశ్వక్ సేన్. ఆల్రెడీ తన సమకాలీకులైన వారు 100 కోట్ల సినిమాలు చేశారు. విశ్వక్ సేన్ మాత్రం వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ రిస్క్ లో పెట్టుకున్నాడు.
అనుదీప్ తో చేస్తున్న ఫంకీ..
ఐతే ఫంకీ మాత్రం విశ్వక్ సేన్ కి మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నారు. మాస్ కా దాస్ ఫ్యాన్స్ కూడా అతని సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. విశ్వక్ సేన్ కయదు లోహర్ జోడీ కూడా సినిమాకు మంచి హైప్ తెచ్చేలా ఉంది. విశ్వక్ సినిమాల్లో సాంగ్స్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. అందులోనూ అనుదీప్ తో చేస్తున్న సినిమా అవ్వడం వల్ల ఈ మూవీపై మరింత ఫోకస్ ఉంటుంది.
అనుదీప్ జాతిరత్నాలు సెన్సేషనల్ హిట్ కాగా.. శివ కార్తికేయన్ తో చేసిన ప్రిన్స్ సినిమా ఓకే అనిపించుకుంది. విశ్వక్ సేన్ తో ఫంకీ మాత్రం మంచి హైప్ తో వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ కోరుకునే హిట్ సినిమా ఇది అవుతుందా లేదా అన్నది చూడాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే. విశ్వక్ సేన్ కూడా లాస్ట్ ఇయర్ 3 సినిమాలు చేసినా రిజల్ట్ అతన్ని నిరుత్సాహ పరిచాయి అందుకే మరో సక్సెస్ పడే వరకు కాస్త టైం తీసుకుందామని ప్రస్తుతం ఫంకీ మాత్రమే చేస్తున్నాడు. మరి మాస్ కా దా కోరుతున్న సూపర్ హిట్ సినిమా ఫంకీ అవుతుందా లేదా అన్నది చూడాలి.
