Begin typing your search above and press return to search.

వ్య‌క్తిత్వాన్ని కోల్పోను.. ఇండ‌స్ట్రీలో ఉండ‌లేవ‌న్నారు.

సినిమా ఇండస్ట్రీలో మన‌కంటే సక్సెస్‌నే ఎక్కువగా మాట్లాడుతుందని విశ్వ‌క్ అంటున్నారు. టాలెంట్, కష్టం ఉన్నా ఫలితం రాకపోతే గుర్తింపు దక్కదనే కఠిన సత్యాన్ని ఆయన స్వయంగా అనుభవించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Feb 2026 8:00 PM IST
వ్య‌క్తిత్వాన్ని కోల్పోను.. ఇండ‌స్ట్రీలో ఉండ‌లేవ‌న్నారు.
X

హీరోల జీవితం బయట నుంచి చూసే వారికి ఎంతో గ్లామరస్‌గా, సౌకర్యాలతో నిండినట్టే కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుల వెనుక ఉన్న పోరాటం, అస్థిరత, అనిశ్చితి గురించి తెలిసిన వారు మాత్రం చాలా తక్కువ. ఈ వాస్తవాన్ని తన జీవితానుభవాలతో స్పష్టంగా చెప్తున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. సినిమా ఇండస్ట్రీలో మన‌కంటే సక్సెస్‌నే ఎక్కువగా మాట్లాడుతుందని విశ్వ‌క్ అంటున్నారు. టాలెంట్, కష్టం ఉన్నా ఫలితం రాకపోతే గుర్తింపు దక్కదనే కఠిన సత్యాన్ని ఆయన స్వయంగా అనుభవించారు.

పెద్ద చ‌దువుల‌కు డ‌బ్బులు ఎక్కువ అవుతాయ‌ని డిగ్రీలో చేరా

సాధార‌ణ కుటుంబంలో పుట్టిన విశ్వక్‌కు చిన్నత‌నంలో ప‌రిస్థితులు, సౌక‌ర్యాలు అంతంత మాత్ర‌మేన‌ట‌. పుట్టినప్పుడు సొంత ఇల్లు కూడా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరగడంతో విశ్వ‌క్ కు జీవితంలోని లోటుపాట్లు బాగా తెలుసు. పెద్ద చదువులు చదవాలంటే ఎక్కువ ఖర్చవుతుందని డిగ్రీలో చేరిన సందర్భాన్ని విశ్వ‌క్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

అకౌంట్ లో రూ.1ల‌క్ష చూస్తే చాల‌నుకున్నా

అలాంటి పరిస్థితుల్లో పెరిగిన విశ్వక్‌కు త‌న‌ బ్యాంక్ అకౌంట్ లో రూ. లక్ష చూస్తే చాలనిపించేద‌ని చెప్పారు. తన కెరీర్‌లో కీలకమైన మలుపుగా నిలిచిన చిత్రం ఫలక్‌నుమా దాస్ విడుదలైన తర్వాత మొదటిసారి తన అకౌంట్‌లో లక్ష రూపాయలు చూసినప్పుడు కలిగిన ఆనందాన్ని విశ్వ‌క్ వివరించారు. దానికి రెండు రోజుల ముందు హిట్ మూవీ అడ్వాన్స్‌గా వచ్చిన రూ.50 వేలును చూసి ఎంతో సంతోషించానని, ఆ క్షణాల‌ను తాను ఎప్పటికీ మర్చిపోలేన‌ని విశ్వ‌క్ పేర్కొన్నారు.

ఎప్పుడూ ఒకేలా ఉంటా

వీట‌న్నింటితో పాటూ విశ్వ‌క్ లో మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తిత్వం కూడా ఉంది. అదే ముక్కుసూటిత్వం. విశ్వ‌క్ ఏదైనా స‌రే ముక్కుసూటిగా చెప్తాడు. దాని వ‌ల్ల తానెన్నో కోల్పోయాన‌ని, అయిన‌ప్ప‌టికీ తాను కొన్ని విష‌యాల్లో గ‌ర్వంగా ఉన్నాన‌ని, తాను ఎక్క‌డైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటాన‌ని, ఎప్పుడూ త‌న వ్య‌క్తిత్వాన్ని కోల్పోన‌ని, అలా కోల్పోతే బ‌తికి ఉన్నా వృధానే అని చెప్పారు విశ్వ‌క్.

తాను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌ల్లో ఇక్క‌డ ఎక్కువ రోజుల నిల‌బ‌డ‌లేవు, త్వ‌ర‌లోనే వెళ్లిపోతావ‌ని చాలా మంది చెప్పార‌ని, కానీ అలాంటి వారంద‌రికీ త‌న సినిమాల‌తోనే తాను స‌మాధానం చెప్పాన‌ని విశ్వ‌క్ చెప్పారు. కాగా విశ్వ‌క్ రీసెంట్ గా అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో ఫంకీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌గా, ఆ సినిమా అనుకున్న ఫ‌లితాన్ని అందుకోలేక‌పోయింది.