Begin typing your search above and press return to search.

విశ్వక్ మౌనం వెనుక కారణం?

ఇక లైలా సినిమా డిజాస్టర్ తర్వాత మరో సినిమా ఏదైనా చేస్తున్నారు అంటే అది ఫంకీ మాత్రమే.

By:  Madhu Reddy   |   21 Jan 2026 9:00 PM IST
విశ్వక్ మౌనం వెనుక కారణం?
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా, స్క్రీన్ ప్లే రచయితగా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు విశ్వక్ సేన్. ఒకప్పుడు తన మాస్, ఎనర్జిటిక్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఎన్నో అంచనాల మధ్య తన కెరియర్లో తొలిసారి లేడీ గెటప్ లో నటించిన చిత్రం లైలా. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. అంతకు ముందు వచ్చిన మెకానిక్ రాఖీ పర్వాలేదనిపించినా.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఇక దీంతో విశ్వక్ సేన్ అభిమానులలో నిరాశ పెరిగిందనే చెప్పాలి. ఇక లైలా సినిమా డిజాస్టర్ తర్వాత మరో సినిమా ఏదైనా చేస్తున్నారు అంటే అది ఫంకీ మాత్రమే. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను విశ్వక్ సేన్ చాలా కీలకంగా తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే గత ఎడాది వచ్చిన లైలా సినిమాతో పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇకపై మంచి కంటెంట్ఉన్న కథతోనే మీ ముందుకు వస్తానని చెప్పి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు విశ్వక్ సేన్ .

ఇక అప్పటినుంచి బయట ఎక్కడా కనిపించలేదు. వేరే హీరోల సినిమా ఈవెంట్లలో కూడా సందడి చేయలేదు. లైలా సినిమా డిజాస్టర్ తర్వాత ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే ఫంకీ సినిమా కోసం తెగ కష్టపడిపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ సినిమా విడుదల సమయంలో ఎలాంటి సినిమాలు లేకుండా జాగ్రత్త తీసుకొని మరీ తన సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అయిపోయారు విశ్వక్ సేన్.

అందులో భాగంగానే జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న అనుదీప్ తో సినిమా చేస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ , సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ , వినోదంతో కూడిన ఒక కుటుంబ కథతో ఈ సినిమా రూపొందుతోందని అన్ని వయసుల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తుందని, ఇటీవల సినీవర్గాలు కూడా తెలిపిన విషయం తెలిసిందే.

అయితే విశ్వక్ సేన్ మాత్రం తన ఫంకీ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. పైగా ఈ సినిమా విడుదలకు కేవలం 22 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో కూడా విశ్వక్ సేన్ సైలెంట్ గా ఉన్నాడు అంటే దానికి కారణం ఆయనకు తన సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకమేనని కొంతమంది చెబుతున్నారు.ముఖ్యంగా సైలెంట్ గా వచ్చి ఫంకీ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ఏది ఏమైనా లైలా డిజాస్టర్ తో బాగా దెబ్బతిన్న విశ్వక్ ఎలాంటి హడావిడి లేకుండా ఫంకీ సినిమాతో వచ్చి మౌత్ టాక్ తోనే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి విశ్వక్ సేన్ న్ కి చాలా కీలకంగా మారిన ఫంకీ సినిమా థియేటర్లలో ఏ విధంగా సందడి చేస్తుందో చూడాలి.