Begin typing your search above and press return to search.

సరైన టైమ్ కే 'ఫంకీ'.. విశ్వక్ గట్టిగా కొట్టాల్సిందే..

దీంతో విశ్వక్ సేన్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్ కొట్టాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.

By:  M Prashanth   |   15 Oct 2025 3:40 PM IST
సరైన టైమ్ కే ఫంకీ.. విశ్వక్ గట్టిగా కొట్టాల్సిందే..
X

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలతో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఆయన చివరగా నటించిన లైలా మూవీ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

దీంతో ఆడియన్స్ కు సారీ చెప్పిన విశ్వక్.. ఇకపై మంచి సినిమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే లైలా రిజల్ట్ తర్వాత ఫంకీ మూవీపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాపై ఆడియన్స్ లో మంచి బజ్ నెలకొంది.

ముఖ్యంగా టీజర్ లో విశ్వక్ సేన్ డైలాగ్ డెలివరీ మెయిన్ హైలెట్ గా నిలిచింది. కామెడీ అందరినీ ఆకట్టుకుంది. సినిమాకు దర్శకత్వం వహిస్తున్న జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ మార్క్ క్లియర్ గా కనిపించింది. పంచులు, ఫన్నీ సీన్స్ మెప్పించగా.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఆడియన్స్ లో మూవీపై అంచనాలు పెరిగాయి.

దీంతో విశ్వక్ సేన్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద గట్టి హిట్ కొట్టాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఫంకీ మూవీ.. వచ్చే ఏడాది రిలీజ్ కానుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏడాది చివర్లో క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే అధికారికంగా మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారని వినికిడి. అయితే అదే రోజు యంగ్ హీరో రోషన్ మేకా నటించిన చాంపియన్ మూవీ విడుదల అవ్వనుంది. అప్పటికే షెడ్యూల్ అయిన అడవి శేష్ డెకాయిట్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాబట్టి ఫంకీ మూవీ రిలీజ్ కు సరైన రిలీజ్ డేట్ దొరికిందని చెప్పాలి. కామెడీ, ఎంటర్టైనెంట్, విశ్వక్ ఎనర్జీ అన్నీ కలిసిన ఫంకీ క్రిస్మస్ టైమ్ లో పక్కాగా వినోదాన్ని అందించనుంది. అయితే సినిమాలో హీరోయిన్‌ గా కయాదు లోహార్ నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. మరి మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.