Begin typing your search above and press return to search.

విశ్వక్‌ తో మామూలుగా ఉండదు!

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా ఒక ట్రెండే. సినిమాల్లోనే కాకుండా మూవీ ప్రమోషన్లలో కూడా ఆయన స్టైల్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది.

By:  M Prashanth   |   22 Oct 2026 3:49 PM IST
విశ్వక్‌ తో మామూలుగా ఉండదు!
X

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఏం చేసినా ఒక ట్రెండే. సినిమాల్లోనే కాకుండా మూవీ ప్రమోషన్లలో కూడా ఆయన స్టైల్ ఎంతో స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ కల్ట్ ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ కు ఆయన వెరైటీ జర్క్ ఇచ్చి, ప్రాంక్ గన్‌ తో ఒక్కసారిగా షాక్ గురిచేశారు. సినిమా విశేషాల గురించి యాంకర్ అడుగుతుండగా, గన్ ప్రస్తావన తీసుకొచ్చారు విశ్వక్. ఆ తర్వాత తన దగ్గర గన్ ను యాంకర్ కు ఇచ్చి ట్రై చేయమన్నారు. ఆ తర్వాత విశ్వకే వెళ్లి షూట్ చేయించారు. ఇంతలో ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం.. సెట్స్ లో ఉన్న పర్సన్ పడిపోయాడు. దీంతో యాంకర్ షాక్ అయిపోయారు.

కాసేపు తర్వాత యాంకర్ తేరుకుని ఇదంతా ఫన్నీ ప్రాంక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. విశ్వక్ తో మామూలుగా ఉండదని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విశ్వకా మజాకా అంటూ సందడి చేస్తున్నారు. అదే సమయంలో కల్ట్ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే కల్ట్ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహించి, లీడ్ రోల్ లో పాత్రలో నటిస్తున్నారు.

కల్ట్ ఇండియా ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్ సినిమాగా రాబోతోంది. రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందించారు. గోవాలోని ఒక పబ్‌ లో ఓ రాత్రి 300 మందికి పైగా యువతీ యువకులు గ్రాండ్‌ గా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే సడెన్ గా కొందరు సైకోలు ఆ పబ్‌ ను చుట్టుముట్టి, అందరినీ లోపలే బంధిస్తారు. అందులో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడాలంటే సైకోలు పెట్టే ఒక భయంకరమైన గేమ్ ఆడాల్సి వస్తుంది.

ఆ ప్రమాదం నుంచి యువతను కాపాడే ఒక రఫ్ అండ్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' తరహాలో ఆ స్టోరీ ఎంతో సస్సెన్స్ గా సాగనుంది. సినిమా ద్వారా విశ్వక్ సేన్ ఏకంగా 150 మంది కొత్త ప్రొఫెషనల్ నటులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక గ్లోబల్ అప్పీల్ ఉన్న స్టోరీ లైన్ కావడంతో తెలుగు, హిందీతో పాటు జపనీస్, స్పానిష్ భాషల్లో కూడా డబ్ చేసి మూవీని రిలీజ్ చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.