వియత్నాంలో ఏం జరిగింది? విశ్వక్ సేన్ భలే సస్పెన్స్..!
విశ్వక్‌సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ 'కల్ట్'.
By: Ramesh Palla | 27 Oct 2026 3:02 PM ISTవిశ్వక్‌సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ 'కల్ట్'. ఈ సినిమాను ఆదర్శ కుటుంబం సినిమాకు పోటీగా విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. త్రివిక్రమ్ వంటి స్టార్ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన మూవీ, వెంకటేష్ వంటి స్టార్ హీరో నటించిన మూవీకి పోటీగా కల్ట్ రావడంను చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశ్వక్‌సేన్ ఈ సినిమాపై నమ్మకంతో ఈ సాహసం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంటెంట్ బలంగా ఉంటే ఎంత పెద్ద సినిమా ఎదురుగా ఉన్నా నిలబడే అవకాశం ఉంటుంది. విశ్వక్ సేన్ అదే నమ్మకంతో సినిమాను అక్టోబర్ 30న విడుదల చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. సినిమాలో ఉన్న కంటెంట్ గురించి విశ్వక్ సేన్ మెల్ల మెల్లగా రివీల్ చేస్తూ వస్తున్నాడు. చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లుగా విశ్వక్ సేన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
విశ్వక్ సేన్ హీరోగా కల్ట్...
సినిమా షూటింగ్‌కు చాలా తక్కువ సమయం పట్టింది, కానీ స్క్రిప్ట్ ను పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని అన్నాడు. సెకండ్ హాఫ్ విషయంలో చాలా స్ట్రగుల్ పడ్డట్లు చెప్పాడు. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ సమస్యను అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో స్క్రిప్ట్ మొత్తం పక్కన పెట్టేయాలని భావించాను. కానీ ఒకరోజు విశ్వక్ సేన్ స్నేహితుడు వియత్నాం నుంచి వచ్చి చెప్పిన విషయంతో మళ్లీ ఈ సినిమా స్క్రిప్ట్‌కు పాయింట్ దొరికిందట. ఈ విషయాన్ని విశ్వక్ చెప్పుకొచ్చాడు. వియత్నాంలో జరిగిన ఆ భయంకర ఘటనను తీసుకుని కల్ట్ కు సెకండ్ పార్ట్ ను కేవలం ఒక నైట్ లో రాసినట్లు పేర్కొన్నాడు. అక్కడి మీడియాలో కూడా చెప్పలేనంత భయానక సంఘటన జరిగిందని, అందుకే దాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.
వియత్నాంలో ఏం జరిగింది?
ఇప్పుడు వియత్నాంలో జరిగిన ఆ సంఘటన ఏంటి ? దాన్ని సినిమాలో ఎలా చూపించబోతున్నారు అనే ఆసక్తి మొదలైంది. కల్ట్ సినిమా మొత్తం కథ గోవా బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. రా అండ్ రస్టిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. హింస ఎక్కువ ఉన్నప్పటికీ తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని విశ్వక్ సేన్ అంటున్నాడు. మరీ హింసాత్మకంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకంను విశ్వక్ సేన్ వ్యక్తం చేస్తున్నాడు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా గురించి ఇప్పుడు వియత్నాం ఘటనతో మరింతగా పెంచాడు. విశ్వక్ సేన్ చాలా తెలివిగా వియత్నాం ఘటన బయటకు తీసుకు వచ్చాడు. దాంతో సినిమాలో ఏం ఉంది, అసలు వియత్నాంలో ఏం జరిగిందనే చర్చ మొదలైంది.
విశ్వక్ సేన్ తాజా చిత్రం...
విశ్వక్ సేన్ చేసిన ఈ సస్పెన్స్ ప్రమోషన్ స్టంట్ వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. విశ్వక్ సేన్ సైతం తన గత చిత్రాల ఫలితాలకు విభిన్నంగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలు లైలా, ఫంకీ విఫలం అయ్యాయి. నవ్వించే ప్రయత్నం చేసిన విశ్వక్ సేన్ విఫలం అయ్యాడు. ఇప్పుడు థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్ట్ టైటిల్ తోనే మెప్పించిన విశ్వక్ సేన్ ఇప్పుడు వియత్నాం సస్పెన్స్ తో సినిమాపై అంచనాలు పెంచాడు. మరి సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ థ్రిల్లర్ సినిమా కోసం విశ్వక్ సేన్ చాలా ప్రత్యేక శ్రద్ద తీసుకున్నట్లు తెలుస్తోంది. కనుక తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.
