Begin typing your search above and press return to search.

విశ్వక్ 'కల్ట్'.. డేట్ కూడా కలిసొచ్చేలా ఉందే..

స్లాషర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉంది. లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

By:  M Prashanth   |   19 Sept 2026 11:37 PM IST
విశ్వక్ కల్ట్.. డేట్ కూడా కలిసొచ్చేలా ఉందే..
X

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా కల్ట్. స్లాషర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ ఉంది. లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అక్టోబర్ 30వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో కల్ట్ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎందుకంటే అక్టోబర్ 30వ తేదీన సినిమా థియేటర్లలోకి రానుండగా.. ఆ తర్వాతి వారంలో దీపావళి హాలీడేస్ ఉన్నాయి. దీంతో కల్ట్ మూవీ రిలీజ్ అయిన రెండో వారంలో పండుగ సెలవుల ప్రభావం సినిమాకు కలిసొచ్చే ఛాన్స్ కచ్చితంగా ఉంది. అందుకే కల్ట్ మూవీ కోసం అక్టోబర్ 30 తేదీని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది.

సాధారణంగా పండుగ సీజన్‌ లో సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. వరుస సెలవులు ఉండటంతో కుటుంబ ప్రేక్షకులు, యువత థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యాక్షన్ సినిమాలకు కూడా ఇలాంటి హాలిడే సీజన్ కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కల్ట్ మూవీకి కూడా రిలీజ్ అయిన కొద్ది రోజులకే దీపావళి సెలవులు రావడం సినిమాకు ప్లస్ పాయింట్‌ గా మారనుంది.

ఇక విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ మూవీ టీమ్ విడుదల చేసిన గ్లింప్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇందులో విశ్వక్‌ సేన్ రక్తంతో తడిసిన యాక్షన్ అవతార్ లో కనిపించారు. కోపంగా, చాలా రఫ్‌ గా కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాకు ఉండబోయే డార్క్ టోన్‌ ను క్లియర్ గా చూపిస్తోంది. ఇప్పటివరకు విశ్వక్‌ సేన్ కనిపించిన పాత్రలకు భిన్నంగా కల్ట్ సినిమా ఉండబోతుందనే ఇంట్రెస్ట్ ను గ్లింప్స్ పెంచుతోంది.

ఇక కల్ట్ సినిమాకు విశ్వక్‌ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే చూసుకుంటున్నారు. స్లాషర్ యాక్షన్ స్టోరీ తెరకెక్కుతున్న ఆ సినిమాను పలు భారతీయ భాషల్లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సినిమా కు కీలకంగా ఉండబోతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ లో విశ్వక్‌ సేన్ దర్శకత్వం, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్పెషల్ గా కనిపిస్తున్నాయి. తారక్ సినిమాస్ బ్యానర్‌ పై సందీప్ కరాల ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న కల్ట్ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. త్వరలోనే మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ను మేకర్స్ నిర్వహించే అవకాశం ఉంది. మరి సినిమా విడుదలైన రెండో వారంలోనే పండుగ వాతావరణం ఉండటంతో.. ఆ డేట్ సినిమాకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.