షూటింగ్స్.. మైండ్‌సెట్‌పై విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
కొంతమంది నటులు తమ నటన.. పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేయడం గురించి భారీ రేంజ్‌లో బిల్డప్‌లు ఇస్తుంటారు.
By: Srikanth Kontham | 26 Oct 2026 9:22 AM ISTతనదైన నటనతో.. మాస్ ఇమేజ్‌తో కామ్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్. ఏ విషయాన్నైనా దాపరికం లేకుండా.. ఉన్నది ఉన్నట్లు ఓపెన్‌గా మాట్లాడటం ఆయన నైజం. సినిమా ప్రమోషన్లలో కానీ... ఇంటర్వ్యూలలో కానీ విశ్వక్ చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా నటుల యాక్టింగ్ ప్రాసెస్.. మైండ్‌సెట్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.
కొంతమంది నటులు తమ నటన.. పాత్రలలోకి పరకాయ ప్రవేశం చేయడం గురించి భారీ రేంజ్‌లో బిల్డప్‌లు ఇస్తుంటారు. ఒకేసారి రెండు..మూడు సినిమా షూటింగ్ లు చేసామని..దీంతో ఆ పాత్రలు ఎంత మర్చిపో వాలనుకున్నా? సాధ్యపడలేదనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే ఇలాంటి ఆర్భాటపు మాటలను నమ్మోదంటూ విశ్వక్ సేన్ తనదైన శైలిలో చెప్పారు. ఇదంతా గొప్పలకు చెప్పుకునే మాటలే తప్ప అందులో నిజం లేదన్నారు.
సగటు మనిషిలాగే నటులకు కూడా నిత్య జీవితంలో ఎన్నో ఆచరణాత్మకమైన సమస్యలు ఉంటాయని విశ్వక్ గుర్తుచేశారు. `ఒకేసారి పక్కపక్క సెట్లలో మూడు సినిమాలు చేసి.. ఆ పాత్రలే మైండ్‌లో తిరుగుతున్నాయని చెప్పే మాటలను నమ్మకండి. ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కరికీ ఈఎంఐ లు కట్టాల్సిన ఆలోచనలు, ఇతర వ్యక్తిగత కుటుంబ సమస్యలే నెత్తికెక్కుతాయి. అలాంటప్పుడు ఆయా పాత్రలను ఇంకా గుర్తుంచుకునేంత సీన్ ఎవరికీ ఉండదు` అని విశ్వక్ సేన్ హాస్యాస్పదంగా అన్నారు.
సినిమా రంగంలో సెలబ్రిటీలు యాక్టింగ్ మెథడాలజీ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సహజమే అయినా? విశ్వక్ సేన్ మాత్రం ఆ భావజాలాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు. రోజంతా లైట్ల వెలుగులో.. కెమెరా ముందు ఎంత గొప్పగా నటించినా? షూటింగ్ ప్యాకప్ కాగానే ప్రతి ఒక్కరూ బాధ్యతలు..ఆర్థిక లావాదేవీల వైపే ఆలోచిస్తారని విశ్వక్ ప్రాక్టికల్ పాయింట్‌ను బయటపెట్టారు.
విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయన నిజాయితీని, ప్రాక్టికల్ ఆలోచనా విధానాన్ని మెచ్చుకుంటున్నారు. పరిశ్రమలో నటులు ఇచ్చే కలర్‌ఫుల్ బిల్డప్‌లకు చెక్ పెడుతూ సామా న్యుడిలా ఆలోచించి చెప్పిన వ్యాఖ్యలు రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నటన విషయంలో ఆర్భాటాలకు పోకుండా గ్రౌండ్ రియాలిటీని బయటపెట్టిన విశ్వక్ సేన్ మాటలు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. నటులమైనంత మాత్రాన తామేమీ వేరే ప్రపంచం నుంచి రాలేదని, అందరిలాగే తమకూ ఈఎంఐలు.. రోజువారి సమస్యలు ఉంటాయని చెప్పడం విశ్వక్ సహజ సిద్ధమైన శైలికి అద్దం పడుతోంది.
