Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టాప్- 10 హీరోయిన్ల చీర సొగ‌సు

భారతీయ సంప్రదాయంలో చీర‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి తెలిసిందే. పండుగ ఏదైనా.. భామలు చీరకడితే ఆ కళే వేరు.

By:  Sivaji Kontham   |   15 April 2026 8:15 AM IST
ఫోటో స్టోరి: టాప్- 10 హీరోయిన్ల చీర సొగ‌సు
X

భారతీయ సంప్రదాయంలో చీర‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి తెలిసిందే. పండుగ ఏదైనా.. భామలు చీరకడితే ఆ కళే వేరు. 2026 `విషు` పండుగ సందర్భంగా భారతీయ చలనచిత్ర రంగంలోని అగ్ర కథానాయికలు తమ చీరకట్టుతో సౌందర్యాన్ని, మోడ్ర‌న్ స్టైల్ ను మేళవించి సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నారు. సంప్రదాయ నేత మొదలుకొని .. సింపుల్ ఆర్గంజా వస్త్రాల వరకు తారలు తమ ఫ్యాషన్ ఎంపికలతో పండుగ వాతావరణానికి మరింత శోభను చేకూర్చారు.




మహానటి కీర్తి సురేష్ తన రాయల్ గోల్డ్ చీరలో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా మెరిసిపోతున్నారు. దీనికి స్టేట్‌మెంట్ టెంపుల్ జువెలరీని జోడించి పండుగ కళను ఉట్టిపడేలా చేశారు. అలాగే త్రిష కృష్ణన్ క్రీమ్ అండ్ గోల్డ్ సిల్క్ చీరలో క్లాసిక్ లుక్‌ను ప్రదర్శించగా.. రెడ్ కలర్ బ్లౌజ్ ఆ అందానికి మరింత మెరుగులు దిద్దింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆఫ్-వైట్ సిల్క్ చీరలో... జుట్టులో మల్లెపూలతో దేవకన్యలా కనిపిస్తూ విషు పండుగ విశిష్టతను చాటిచెప్పారు.

మరోవైపు నయనతార బంగారు వ‌ర్ణం టిష్యూ సిల్క్ చీరలో రాచరికపు హుందాతనాన్ని ఒలకబోయగా... సమంత రూత్ ప్రభు పసుపు - ఆకుపచ్చ రంగుల మేళవింపుతో కూడిన చీరలో దేవ‌క‌న్య‌ను తలపిస్తున్నారు. పార్వతి ఎరుపు రంగు చీరపై గోల్డెన్ ఫోయిల్ వర్క్‌తో సంప్రదాయ మూలాలను ప్రతిబింబించగా.. అదితి రావు హైదరీ ఊదా రంగు చీర -భారీ ఆభరణాలతో పండుగ వైబ్ ని నింపారు. వీరందరి మేకోవర్స్ సంప్రదాయానికి పట్టాభిషేకం చేసినట్లుగా ఉన్నాయి.

ప్రయోగాలకు వేదికగా నిలిచిన రుక్మిణి గ్రీన్-అండ్-పింక్ కాంట్రాస్ట్ చీరలో కట్ అవుట్ బ్లౌజ్‌తో విభిన్నంగా కనిపించగా... సాన్యా మల్హోత్రా బేబీ పింక్ ఆర్గంజా చీరను పర్పుల్ బ్రోకేడ్ బ్లౌజ్‌తో జతచేసి రొమాంటిక్ అండ్ ఫెస్టివ్ లుక్‌ను సృష్టించారు. జాన్వీ కపూర్ హెవీ ఎంబ్రాయిడరీ గోల్డ్ చీరతో తన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలియా భట్ మాత్రం సింపుల్ బ్లూ ప్రింటెడ్ చీరతో `తక్కువలోనే ఎక్కువ అందం` అన్నట్లుగా ఆకట్టుకున్నారు.

ఓవ‌రాల్ గా అగ్ర కథానాయికలందరూ చీరకట్టులో మెరిసిపోతూ ఫ్యాషన్ ప్రియులకు గొప్ప ప్రేరణగా నిలిచారు. ఆధునిక కాలంలో వెస్ట్రన్ దుస్తులకు ఎంత ప్రాధాన్యత ఉన్నా.. పండుగ వేళ చీరకట్టు ఇచ్చే ఆత్మవిశ్వాసం, గౌరవం మరే ఇతర దుస్తుల్లోనూ ఉండదని ఈ భామల ఫోటోలు నిరూపిస్తున్నాయి. ఈ విషు వేడుకల్లో తారల `చీర సొగసు` సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి పండుగ సంబరాలను రెట్టింపు చేసింది.