విష్ణుప్రియపై మళ్లీ ట్రోల్స్.. అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్?
సోషల్ మీడియా జెనరేషన్ లో సెలబ్రిటీలు చేసే ప్రతి ఒక్క కామెంట్ వెంటనే వైరల్ అయిపోతుంది.
By: M Prashanth | 16 Jun 2026 12:41 PM ISTసోషల్ మీడియా జెనరేషన్ లో సెలబ్రిటీలు చేసే ప్రతి ఒక్క కామెంట్ వెంటనే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు చర్చకు వస్తే.. మద్దతు, విమర్శలు ఒకేసారి వినిపిస్తాయి. తాజాగా యాంకర్, నటి విష్ణుప్రియ చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. అభిమానులతో నిర్వహించిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఆమె చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆమె.. టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం టీవీ షోస్ కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం కేటాయిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
ఇటీవల విష్ణుప్రియ ఇన్ స్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించింది. సబ్ స్క్రైబర్ల కోసం స్పెషల్ కంటెంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే వ్యవహారం గతంలో వివాదానికి కూడా కారణమైంది. కొందరు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమె సోషల్ మీడియా కంటెంట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతను తప్పుదోవ పట్టించేలా కంటెంట్ ఉందంటూ ఆరోపించారు. అయితే ఆ వివాదం ఆమెకు ప్లస్ అయిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
తాజాగా సబ్ స్క్రైబర్లతో నిర్వహించిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు విష్ణుప్రియ ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ ఫాలోవర్ "మీ బాడీ కౌంట్ ఎంత?" అని ప్రశ్నించగా.. "నా బాడీ కౌంట్ ఐదు. నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెబుతున్నాను" అని ఆమె స్పందించినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే బాడీ కౌంట్ అనే వర్డ్ కు సెపరేట్ మీనింగ్స్ ఉండటంతో ఆమె కామెంట్స్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడు విష్ణుప్రియ కామెంట్స్ ను కొందరు ఆమె పర్సనల్ ఫ్రీడమ్ గా చెబుతున్నారు. అడిగిన క్వశ్చన్ కు నిజాయితీగా ఆన్సర్ చెప్పడంలో తప్పేమీ లేదని అంటున్నారు.
మరోవైపు సెలెబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట సొసైటీపై ఎఫెక్ట్ చూపుతుందని, ముఖ్యంగా యువతకు వెళ్లే మెసేజ్ విషయంలో జాగ్రత్త అవసరమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పర్సనల్ లైఫ్ లో ఎవరి ఇష్టం వాళ్లది అయినప్పటికీ.. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే కామెంట్స్ చర్చకు దారి తీయడం కొత్తేం కాదు. అయితే విమర్శలు చేసే టైమ్ లో కూడా పర్సనల్ రెస్పెక్ట్ కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఏదేమైనా విష్ణుప్రియ కామెంట్స్ మరోసారి ట్రోల్స్ కు కారణమయ్యాయి. కానీ ఆ వివాదం ఫ్రీడమ్, రెస్పాన్సిబులిటీ మధ్య ఉన్న డిఫరెన్స్ పై చర్చ మొదలుపెట్టిందనే చెప్పాలి.
