రాచసన్ కు మించి ఆర్యన్ ఉంటుందా? హీరో ఏమన్నారంటే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గొప్పలు చెప్పకుండా హోనెస్ట్ గా విష్ణు విశాల్ మాట్లాడారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
By: M Prashanth | 26 Oct 2025 7:00 AM ISTకోలీవుడ్ హీరో విష్ణు విశాల్.. ఇప్పుడు ఆర్యన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న తెలిసిందే. తెలుగు కూడా సందడి చేయనున్నారు. కంప్లీట్ సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు ప్రవీణ కె దర్శకత్వం వహించగా.. విష్ణు విశాల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఆ సమయంలో ఆసక్తికర విషయాలు పంచుకుంటుండగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే ఆర్యన్ మూవీపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా విష్ణు విశాల్ గతంలో నటించ రాచసన్ గుర్తుకొచ్చింది. 2018లో రిలీజ్ అయిన ఆ సినిమా ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించింది.
ఆ తర్వాత తెలుగులో రాక్షసుడిగా రీమేక్ అయ్యి మన దగ్గర కూడా మంచి హిట్ అయింది. ఏదేమైనా భారతీయ సినీ చరిత్రలో బెస్ట్ థ్రిల్లర్స్ మూవీల్లో ఒకటిగా నిలిచిన రాచసన్ మూవీతో ఇప్పుడు కొందరు ఆర్యన్ మూవీని పోల్చారు. ఇప్పుడు ఆ విషయంపై విష్ణు విశాల్ మాట్లాడారు. అందరూ తనను అందే విషయాన్ని అడుగుతున్నట్లు చెప్పారు.
కానీ తాము మాత్రం రాచసన్ రేంజ్ లో.. అంతకు మించి ఆర్యన్ మూవీ తీయలేదని తెలిపారు. ఆ సినిమా మ్యాజిక్ రీ క్రియేట్ చేయడం చాలా కష్టమని తెలిపారు. అయితే ఆర్యన్ మూవీ కొత్తగా మంచి థ్రిల్లర్ గా తీశామని పేర్కొన్నారు. కానీ తమ సినిమా.. సినీ ప్రియులకు కచ్చితంగా సూపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గొప్పలు చెప్పకుండా హోనెస్ట్ గా విష్ణు విశాల్ మాట్లాడారని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు.. సినిమా గురించి బజ్ క్రియేట్ చేసే విధంగా మాట్లాడారని చెబుతున్నారు. రెండూ థ్రిల్లర్స్ అయినా ముందు మూవీని ప్రస్తావనకు తీసుకురాకపోవడం గ్రేట్ అని అంటున్నారు.
అయితే రాచసన్ స్క్రిప్టు వినగానే అందులో విలన్ గా తాను యాక్ట్ చేస్తానని అప్పుడు డైరెక్టర్ ను అడిగినట్లు మరో ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ అప్పటికే మరో నటుడు ట్రైనింగ్ అయ్యారని చెప్పారు. దీంతో ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేక హీరోగా నటించారని పేర్కొన్నారు. మరి అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కానున్న ఆర్యన్ తో ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి.
