మాస్ జాతర - బాహుబలి.. యువ హీరో వెనుకడుగు
ఆర్యన్ ఇప్పుడు నవంబర్ 7న తెలుగులో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. తమిళంలో విడుదల అయ్యాక కేవలం ఒక వారం తర్వాత వస్తుందని చెప్పారు.
By: M Prashanth | 28 Oct 2025 9:55 PM ISTకోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆర్యన్. కంప్లీట్ సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమాతో తెలుగులో కూడా సందడి చేయనున్నారు. అక్టోబర్ 31వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఆర్యన్ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ నిర్వహించారు.
తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఆర్యన్ మూవీ కోసం అటు తెలుగులో.. ఇటు తమిళ్ లో ఫుల్ జోష్ గా ప్రమోట్ చేశారు విష్ణు విశాల్. అయితే తాజాగా కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 31వ తేదీన తమిళ్ లో మాత్రమే సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలుగులో నవంబర్ 7వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ఆ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో విష్ణు విశాల్ ప్రకటన విడుదల చేశారు. ప్రియమైన తెలుగు ప్రేక్షకులారా.. సినిమా అనేది ఒక జాతి కాదు .. ఇది ఒక వేడుక అంటూ చెప్పుకొచ్చారు. తాను ఆర్యన్ మూవీని చాలా గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 31న విడుదల చేయాలని ప్లాన్ చేశామని విష్ణు విశాల్ ప్రకటించారు.
ఆ ప్రత్యేక తేదీ.. మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసిన మాస్ జాతర, పవర్ ఫుల్ బాహుబలి ది ఎపిక్ అందరినీ అలరించడానికి రావడంతో మరింత ప్రత్యేకంగా మారిందని విష్ణు విశాల్ తెలిపారు. రవితేజకు పెద్ద ఫ్యాన్ గా.. తెరపై ఆయన పవర్ కు మాత్రమే కాకుండా దాని వెనుక కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అదే సమయంలో ఎస్ ఎస్ రాజమౌళికి లైఫ్ లాంగ్ తాను అభిమానిని తెలిపారు. అందుకే ఈ వీక్ వారి వేడుకలు మనం ప్రకాశవంతంగా నిర్వహించడానికి సరైనదేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్యన్ ఇప్పుడు నవంబర్ 7న తెలుగులో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. తమిళంలో విడుదల అయ్యాక కేవలం ఒక వారం తర్వాత వస్తుందని చెప్పారు.
అదే లవ్ తోపాటు థ్రిల్ తో తెలుగులో రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఎప్పటిలానే ఓపిక, మద్దతు తనకు ప్రపంచం లాంటిదని పేర్కొన్నారు. తన నిర్ణయంలో మద్దతు ఇచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. తాను చెప్పిన విషయం పట్ల ఎప్పుడు కట్టుబడి ఉంటానని తెలిపారు.
తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ మూవీస్ ను అందించేందుకు తాను రెడీ అని తెలిపారు విష్ణు విశాల్. తాను ఏదో ఒక రోజు దీన్ని చేస్తానని కచ్చితంగా అనుకుంటున్నానని అన్నారు. ఆర్యన్ ప్రారంభంగా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రవీణ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
