సైలెంట్ గా కానిచ్చేస్తున్న నాగవంశీ
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా అందుకుంది.
By: Sravani Lakshmi Srungarapu | 8 Oct 2025 3:37 PM ISTయూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి కలెక్షన్లను కూడా అందుకుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా హైప్ లేకుండానే వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్వ్కేర్ ను తీశారు.
మ్యాడ్ ఫ్రాంచైజ్ లో మూడో సినిమాగా మ్యాడ్3
మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ కు మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఈ మూవీ కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది. మ్యాడ్ సినిమాలో విష్ణు ఓయి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. లడ్డూ మామ క్యారెక్టర్ లో విష్ణు యాక్టింగ్ కూడా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది.
మ్యాడ్ స్క్వేర్ క్లైమాక్స్ లో ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మ్యాడ్ క్యూబ్ (మ్యాడ్3) టైటిల్ తో రానున్న ఈ మూవీ గురించి విష్ణు రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. విష్ణు నటించిన మిత్ర మండలి మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో మ్యాడ్3 గురించి ఆయన మాట్లాడారు.
మ్యాడ్3 షూటింగ్ మొదలు
ఆల్రెడీ మ్యాడ్3 షూటింగ్ మొదలైందని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ సోషల్ మీడియాలో కూడా రానుందని చెప్పారు. ఆల్రెడీ మ్యాడ్ ఫ్రాంచైజ్ కు ఆడియన్స్ లో మంచి హైప్, క్రేజ్ ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా రూపొందుతుందని, కళ్యాణ్ శంకర్ మ్యాడ్ 3ని మరింత ఎంటర్టైనింగ్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. మ్యాడ్, మ్యాడ్2 ను నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నాగవంశీనే ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. అయితే వార్2 సినిమాతో తన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని విమర్శల పాలైన వంశీ కావాలనే ఈ సినిమాను సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లారని అంటున్నారు.
