Begin typing your search above and press return to search.

విశాల్, తమన్నా మూవీ.. గ్లింప్స్ భలే ఉందిగా!

గ్లింప్స్‌ లో స్టార్ హీరోయిన్ తమన్నా ఒక టెలివిజన్ సీరియల్ చూస్తూ.. అందులో మునిగిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది.

By:  M Prashanth   |   21 Jan 2026 11:39 PM IST
విశాల్, తమన్నా మూవీ.. గ్లింప్స్ భలే ఉందిగా!
X

కోలీవుడ్ స్టార్ విశాల్.. ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ సుందర్ తో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. హిట్ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వారి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. తొలుత ఇద్దరూ కలిసి ఆంబల సినిమా చేయగా.. ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత యాక్షన్‌ మూవీతోపాటు మదగజ రాజా సినిమాలకు గాను వర్క్ చేశారు.

చాలా ఏళ్ల పాటు విడుదలవ్వని మద గజ రాజా మూవీ.. గత ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి సుందర్ తో విశాల్ వర్క్ చేస్తుండగా.. తాజాగా సినిమా నుంచి మ్యాసివ్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే విశాల్, సుందర్ కలిసి చేసిన ఫన్నీ వీడియో రిలీజ్ చేయగా.. ఇప్పుడు టైటిల్ ను అనౌన్స్ చేశారు. పురుషన్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు.. తెలుగులో మొగుడు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా వెల్లడించారు.

గ్లింప్స్‌ లో స్టార్ హీరోయిన్ తమన్నా ఒక టెలివిజన్ సీరియల్ చూస్తూ.. అందులో మునిగిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. విశాల్, బహుశా ఆమె భర్త, నేల ఊడ్చుతున్నట్లు కనిపిస్తుంది. ఈలోగా సీరియల్‌ లో కనిపించే యోగి బాబు వారి ఇంటికి వస్తాడు. తమన్నా అతనితో మాట్లాడుతుంది. ఇంతలో తమన్నా విశాల్‌ ను ఒక కప్పు టీ పెట్టమని అడుగుతుంది. వంటగది లోపల కొంత మంది గూండాలు ఇంట్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది.

విశాల్ వారితో గట్టిగా పోరాడుతుంటే.. యోగి బాబు షాక్ అవుతారు. అయితే జరుగుతున్నదంతా తెలియని తమన్నా.. తన భర్తను ఆర్డర్ ఇస్తూనే ఉంటుంది. చివరగా.. టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొగుడు మూవీ గ్లింప్స్.. వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ యాక్షన్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

విశాల్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టేలా.. సెటిల్డ్ యాక్షన్ తో మెప్పించేలా ఉన్నారు. అదే సమయంలో తమన్నా పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. యోగిబాబు కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. గ్లింప్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్య.. అంటూ యోగిబాబు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.

ఇక సినిమాను బెంజ్ మీడియా బ్యానర్‌పై ఏసీఎస్ అరుణ్ కుమార్, అవ్ని సినిమాక్స్ బ్యానర్‌ పై ఖుష్బు సుందర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా గోపి అమర్‌ నాథ్ వర్క్ చేస్తున్నారు. ఎడిటర్ గా రోజర్ పని చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మరి మొగుడు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.